E-Paper
Advertisement

Kamakshi Bhaskarla: హీరోయిన్‌ను దారుణమైన ప్రశ్న అడిగిన నెటిజన్.. భలే జవాబిచ్చింది!

Kamakshi Bhaskarla: హీరోయిన్‌ను దారుణమైన ప్రశ్న అడిగిన నెటిజన్.. భలే జవాబిచ్చింది!
Advertisement

Kamakshi Bhaskarla: మా ఊరి పొలిమేర 2, రైల్వే కాలనీ 12 ఏ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్న హీరోయిన్ కమాక్షి భాస్కర్ల. ఈ హీరోయిన్ సినిమా రంగంలోకి రాకముందు మోడలింగ్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2018 పోటీలో విజేతగా నిలిచి మంచి గుర్తింపు పొందింది. అదే సంవత్సరం జరిగిన “మిస్ ఇండియా 2018” పోటీలో కూడా పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. ఈ విజయాలు ఆమెకు సినీ అవకాశాలు రావడానికి మార్గం వేసాయి.

2021లో కమాక్షి తన తొలి సినిమా ప్రియురాలుతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు జి.వి. రామ రాజు దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే కమాక్షికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన “మా ఊరి పొలిమేర” సినిమా ఆమె కెరీర్‌లో కీలకంగా మారింది. ఈ సినిమా ద్వారా కమాక్షికి విస్తృత స్థాయిలో గుర్తింపు వచ్చింది. దానికి కొనసాగింపుగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 కూడా మంచి విజయాన్ని సాధించింది.

Advertisement

ప్రస్తుతం కమాక్షి చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అల్లరి నరేష్‌తో కలిసి ఆమె నటిస్తున్న సినిమా “12ఏ రైల్వే కాలనీ”. అలాగే నవీన్ చంద్రతో కలిసి “షో టైమ్” అనే మరో సినిమా కూడా చేస్తోంది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “మా ఊరి పొలిమేర 3” సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

Advertisement

ఇటీవల కమాక్షి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ అభిమాని అడిగిన చాలా వింత ప్రశ్నకు ఆమె వ్యంగ్యంగా, సరదాగా సమాధానం ఇచ్చింది. ఒక అభిమాని అందమైన అమ్మాయిలు అసలు పోప్ చేస్తారా అని అడగగా..ఆ ప్రశ్నకు స్పందిస్తూ కమాక్షి, “డాక్టర్‌గా, నటిగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నాకు గౌరవంగా ఉంది. మీరు అడిగినందుకు సంతోషం. సమాధానం ‘లేదు’. ఎందుకంటే మా కడుపులు సిమెంట్, కాంక్రీటుతో తయారయ్యాయి. మేము తినే ఆహారం అంతా మాయమైపోతుంది. అది ఆర్గానిక్ ఫార్మింగ్‌కి ఉపయోగపడుతుంది” అంటూ హాస్యంగా చెప్పింది.

ఆ వీడియోను షేర్ చేస్తూ ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. “కొన్నిసార్లు ఇంటర్నెట్ చాలా సీరియస్ ప్రశ్నలు అడుగుతుంది… వాటికి సైన్స్ సమాధానాలు ఆశిస్తుంది. కాస్త హాస్యం, కాస్త వ్యంగ్యం, నటులు కూడా సాధారణ మనుషులే అన్న విషయం గుర్తు చేయడానికే ఇది” అని కమాక్షి రాసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ALSO READ: Pragya Jaiswal : అడవుల్లో ప్రగ్యా జైస్వాల్ అడ్వెంచర్.. ఫోటోలు వైరల్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×