E-Paper
Advertisement

Allu Arjun: బన్నీ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడకూడదా? ఆయన్ని కలవాలంటే.. 42 నిబంధనలు పాటించాలా?

Allu Arjun: బన్నీ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడకూడదా? ఆయన్ని కలవాలంటే.. 42 నిబంధనలు పాటించాలా?
Advertisement

Allu Arjun:’ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ (Allu Arjun) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి ఆయన వార్తల్లో నిలిచింది సినిమా హిట్‌తో కాదు.. ఆయన్ని కలవడానికి పాటించాల్సిన 42 కఠిన నిబంధనల జాబితాతో అంటే నమ్ముతారా? అవును.. మీడియా ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్స్ కోసం సిద్ధం చేసినట్లుగా చెబుతున్న ఈ ‘ప్రోటోకాల్’ ఇప్పుడు ఎక్స్‌ వేదికగా దుమారం రేపుతోంది. అసలు ఆయన మనలాంటి మనిషి కాదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అల్లు అర్జున్‌పై ఆరోపణలు చేస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఆమె చెబుతున్న దాని ప్రకారం..

విస్తుపోయే నిబంధనలు:

అన్నింటికంటే విచిత్రమైన అంశం ‘ఐ కాంటాక్ట్’ (కళ్లలోకి నేరుగా చూడటం) పై ఉన్న నిషేధం. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు లేదా ఆయన గదిలో ఉన్నప్పుడు నేరుగా కళ్లలోకి చూడకూడదని, అలాగే నటుడు కోరితే తప్ప కనీసం షేక్ హ్యాండ్ కూడా చేయకూడదని అందులో పేర్కొన్నారు. ఇక భౌతిక దూరం పాటించడం మాత్రమే కాదు, గదిలో ఉన్న సిబ్బంది అతిగా కదలకూడదని, శబ్దం చేయకూడదని ఉన్న నిబంధనలు చూస్తుంటే ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లా కాకుండా ఏదో రాజ శాసన సమావేశంలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హాలీవుడ్ స్టైలా?:

Advertisement

గతంలో టామ్ క్రూజ్, ఎల్లెన్ డిజెనెరస్ వంటి హాలీవుడ్ స్టార్ల విషయంలో కూడా ఇలాంటి ‘నో ఐ కాంటాక్ట్’ రూల్స్ వినిపించేవి. నటులు తమ ఏకాగ్రతను కోల్పోకుండా ఉండటానికి లేదా మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి నిబంధనలు పెట్టుకుంటారని కొందరు మేనేజర్లు సమర్థిస్తారు. అయితే, ప్రేక్షకులను ‘దేవుళ్లుగా’ భావించే భారతీయ సినీ ప్రపంచంలో ఇలాంటి నియమాలు వింతగా అనిపిస్తున్నాయి. ఇక్కడ “ప్రేక్షక దేవుళ్లు” అని పిలిచే స్టార్ల చుట్టూ ఇన్ని గోడలు ఎందుకు? ఇది స్టార్‌డమ్ తెచ్చిన గర్వమా లేక సామాన్యులకు దూరంగా ఉండాలనే తాపత్రయమా అని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు.

ALSO READ:R.Madhavan: యూట్యూబర్ చేసిన పనికి మాధవన్ ఫిదా.. ఏం చేశారంటే?

అల్లు అర్జున్ టీమ్ ఎలా స్పందిస్తుందో..

Advertisement

స్టార్స్ చుట్టూ ఒక కృత్రిమ వాతావరణాన్ని నిర్మించడం వల్ల సహజత్వం దెబ్బతింటుందని మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ 42 నిబంధనల అంశం నిజమా కాదా అన్నది పక్కన పెడితే, సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ పేరుతో స్టార్లకు, సామాన్యులకు మధ్య పెరుగుతున్న దూరాన్ని మాత్రం ఇది స్పష్టంగా చూపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న ఈ 42 నిబంధనల జాబితాపై అల్లు అర్జున్ బృందం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. మరి దీనిపై ఆయన బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×