E-Paper
Advertisement

Nayanthara: జాక్ పాట్ కొట్టిన నయనతార.. ఏడాది మొత్తం ఆమెదే హవా!

Nayanthara: జాక్ పాట్ కొట్టిన నయనతార.. ఏడాది మొత్తం ఆమెదే హవా!
Advertisement

Nayanthara:టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది నయనతార (Nayanthara) . సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. ఈ ఏడాది జాక్ పాట్ కొట్టిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ప్రముఖ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీతో పాటు తన ఇమేజ్ కి తగ్గట్టుగా విజయం సాధించి, అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. అలాంటి ఈమె ఇప్పుడు మరో ఐదు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.మరి నయనతార నుంచి రాబోయే ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ ఏడాది మొత్తం తనదే హవా..

ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) దర్శకత్వంలో ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘మన్నాంగట్టి’ అనే మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ రెండు తమిళ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలే కాకుండా తెలుగు , తమిళ్, మలయాళం చిత్రాలలో కూడా బిజీగా మారిపోయింది నయనతార. పైగా కన్నడలో కూడా ఒక సినిమా చేస్తోంది. ప్రముఖ లేడీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేజిఎఫ్ 1&2 చిత్రాలతో సంచలనం సృష్టించి పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్న యష్(Yash) హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కూడా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నయనతార యష్ కి సోదరి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఈ ఏడాది మొత్తం బిజీగా మారనుంది నయనతార.

Advertisement

ALSO READ:Eesha Rebba: స్టార్ డైరెక్టర్ పై ఈషా రెబ్బా ఊహించని కామెంట్స్..!

కోలీవుడ్లో వరుస అవకాశాలు..

Advertisement

ఇకపోతే నయనతార తమిళ్లో 2019లో బిగిల్ అనే చిత్రంలో నటించింది.ఈ సినిమా తర్వాత ఆమె మరో తమిళ చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది నయనతార. మొత్తానికైతే ఈ ఏడాది వరుస సినిమాలతో ఏడాది మొత్తం ఫుల్ బిజీగా మారడమే కాకుండా ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.ఇక అందులో భాగంగానే తొలి ప్రయత్నంతోనే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయం అందుకున్న ఈమెకు మిగతా చిత్రాలు ఎలాంటి సక్సెస్ను అందిస్తాయో చూడాలి

త్రిష తో కలిసిపోయిన నయనతార..

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న నయనతార..మరొకవైపు తన కోస్టార్ అయిన త్రిష(Trisha) తో కలిసిపోయినట్లు అందుకు సంబంధించిన ఫోటోలను నిన్న విడుదల చేసింది. గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటికి చెక్ పెట్టి ఈ కొత్త ఏడాది తమ స్నేహబంధం ఎప్పటికీ కలకాలం ఇలాగే ఉంటుందని ఫోటోల ద్వారా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే త్రిషతో కలిసిపోయి విమర్శలకు, నెగిటివిటీకి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×