E-Paper
Advertisement

World’s Coffee Pot: వరల్డ్ కాఫీ కప్.. ప్రపంచం తాగే కాఫీలో 40% ఆ ఒక్క దేశానిదే ?

World’s Coffee Pot: వరల్డ్ కాఫీ కప్.. ప్రపంచం తాగే కాఫీలో 40% ఆ ఒక్క దేశానిదే ?
Advertisement

World’s Coffee Pot: మనకు రోజూ ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగనిదే రోజూ గడవదు కదా. కానీ.. ప్రపంచం మొత్తానికి ఇన్ని కోట్ల కప్పుల కాఫీని అందిస్తున్న ఆ దేశం ఏదో మీకు తెలుసా ? దాదాపు 150 ఏళ్లుగా కాఫీ ఉత్పత్తిలో ఏ దేశం కూడా అందుకోలేనంత ఎత్తులో ‘బ్రెజిల్’ రారాజులా కొనసాగుతోంది. అసలు ప్రపంచం మొత్తం తాగే కాఫీలో దాదాపు 40 శాతం వాటా ఆ ఒక్క దేశానిదే అంటే నమ్ముతారా ? అసలు బ్రెజిల్ ఎందుకంత స్పెషల్ ? అక్కడ అంతలా కాఫీ ఎలా పండిస్తారు? దీని వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం”

“ప్రపంచంలో కాఫీ ప్రియులు లేని దేశం ఉండదు. కానీ.. ప్రపంచానికే కాఫీని పరిచయం చేస్తున్న దేశం మాత్రం ‘బ్రెజిల్’. గత 150 ఏళ్లుగా రికార్డు స్థాయిలో కాఫీ పండిస్తూ.. గ్లోబల్ మార్కెట్‌లో 40% వాటాతో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. అందుకే బ్రెజిల్‌ను ‘వరల్డ్ కాఫీ కప్’ అని పిలుస్తారు.

Advertisement

 బ్రెజిల్
బ్రెజిల్ దేశం కాఫీ సాగుకు అత్యంత అనుకూలమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇక్కడ సుమారు 27,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కాఫీ తోటలు విస్తరించి ఉన్నాయి. బ్రెజిల్‌లో ప్రధానంగా అరబికా, రోబస్టా అనే రెండు రకాల కాఫీ గింజలను పండిస్తారు. ఇందులో అరబికా రకానికి అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధర పలుకుతుంది. మినాస్ గెరైస్, సావో పాలో, పరానా వంటి ప్రాంతాలు కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలో కాఫీ ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయి. లక్షలాది మందికి ఇది ఉపాధిని కల్పిస్తోంది.

కాఫీ అనేది కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు.. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన వాణిజ్య పంట. దక్షిణ అమెరికాలోని విశాలమైన తోటల నుంచి ఆసియాలోని కొండ ప్రాంతాల వరకు, కాఫీ ఉత్పత్తిలో కొన్ని దేశాలు అగ్రగామిగా ఉన్నాయి.

Advertisement

మీకు తెలుసా?:

ప్రపంచంలో పెట్రోలియం తర్వాత అత్యధికంగా మార్కెట్ చేయబడే రెండో అతిపెద్ద వస్తువు ‘కాఫీ’. దాదాపు 150 ఏళ్లుగా ఒకే దేశం ఈ రంగంలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. అదే- బ్రెజిల్

ప్రపంచంలోని టాప్ 5 కాఫీ ఉత్పత్తి దేశాలు:
1.బ్రెజిల్
2.వియత్నాం
3.కొలంబియా
4 .ఇండోనేషియా
5.ఇథియోపియా

Also Read: డార్క్ చాక్లెట్‌తో గుండె సమస్యలకు చెక్.. ఇందులో నిజమెంత ?

ఇండియాలో కాఫీ ఉత్పత్తి:
ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా కూడా కాఫీ ఉత్పత్తిలో తనదైన గుర్తింపు పొందింది. భారత్.. ప్రపంచంలో సుమారు 7వ స్థానంలో ఉంది. మన దేశంలో కాఫీని ఎక్కువగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో, చెట్ల నీడలో పండిస్తారు. దీని వల్ల ఇక్కడి కాఫీకి ఒక ప్రత్యేకమైన వాసన, రుచి లభిస్తుంది. కర్ణాటకలో ఎక్కువగా కాఫీ పండిస్తారు. (మొత్తం ఉత్పత్తిలో దాదాపు 70%). ఆ తర్వాత కేరళ , తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలోని అరకు కాఫీ కూడా అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకుంది.

కాఫీ రకాలు:
అరబికా: ఇది కొంచెం తీపి, తక్కువ కెఫీన్ కలిగి ఉంటుంది. దీని సాగుకు చల్లని వాతావరణం అవసరం.

రోబస్టా: ఇది ఘాటైన రుచి, ఎక్కువ కెఫీన్ కలిగి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల దీనిని పండించడం సులభం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×