E-Paper
Advertisement

Nagarjuna: తెలంగాణ డిప్యూటీ సీఎంతో నాగార్జున భేటీ…అదే కారణమా?

Nagarjuna: తెలంగాణ డిప్యూటీ సీఎంతో నాగార్జున భేటీ…అదే కారణమా?
Advertisement

Nagarjuna: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను (Bhatti Vikramarka)మర్యాదపూర్వకంగా కలిశారు.నాగార్జున మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి డిప్యూటీ సీఎంను  ప్రజాభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలా డిప్యూటీ సీఎంని కలిసిన నాగార్జున రాష్ట్ర అభివృద్ధి కోసం సినీ రంగానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించారని తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, ఆ పాఠశాలల విశిష్టత గురించి కూడా నాగార్జున అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో తనవంతు సహాయం చేయడానికి నాగార్జున సిద్దమైనట్లుగా తెలుస్తుంది.

డిప్యూటీ సీఎంతో మర్యాదపూర్వక భేటీ..

ఇలా ఉన్నఫలంగా నాగార్జున డిప్యూటీ సీఎం, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ తో భేటీ కావటం వల్ల ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటూ ఎంతో మంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగార్జున కలవడం మర్యాదపూర్వకమైనదే అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

లాటరీ కింగ్..

Advertisement

నాగార్జున ఇప్పటివరకు హీరోగా 99 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. త్వరలోనే ఈయన వందవ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. నాగార్జున 100 వ సినిమా కావడంతో ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉండడమే కాకుండా అక్కినేని అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకంగా మారనుంది. ఇక ఈ సినిమాకు “లాటరీ కింగ్”(Lottery King) అనే టైటిల్ పెట్టబోతున్నారని ఇందులో నాగార్జున సరసన టబు, అనుష్క వంటి పలువురు హీరోయిన్లు నటించబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

కూలి సినిమాలో విలన్ గా..

Advertisement

ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్లో రాబోతుందని నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పట్ల ఏ విధమైనటువంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే చిత్ర బృందం ఈ విషయాలను అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన చివరిగా నా సామిరంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత హీరోగా సినిమాలు చేయకపోయినా ఇతర హీరోల సినిమాలలో క్యామియో పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కుబేర సినిమా, అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా సినిమాలతో పాటు బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.

Also Read: Bandla Ganesh: మళ్లీ సారీ చెప్పిన బండ్లన్న… అనాల్సినవి అన్ని అనేసి… ఇప్పుడు క్షమాపణలా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×