E-Paper
Advertisement

GV Prakash : అల వైకుంఠపురంలో రేంజ్ లో సూర్య వెంకీ అట్లూరి సినిమా, అవార్డ్స్ అన్ని ఆ సినిమాకు

GV Prakash : అల వైకుంఠపురంలో రేంజ్ లో సూర్య వెంకీ అట్లూరి సినిమా, అవార్డ్స్ అన్ని ఆ సినిమాకు
Advertisement

GV Prakash : జీవి ప్రకాష్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు జీవీ ప్రకాష్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి జీవి ప్రకాష్ మేనల్లుడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే జీవి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. తెలుగులో కూడా జీవి ప్రకాష్ చేసిన ఎన్నో ఆల్బమ్స్ ఘన విజయాన్ని సాధించాయి.

ముందుగా ఏఆర్ రెహమాన్ దగ్గర కొన్ని సినిమాలకు పనిచేసిన జీవి ప్రకాష్ కుమార్, ఆ తర్వాత హరీష్ జయరాజ్ దగ్గర కొన్ని సినిమాలుకు వర్క్ చేశాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాలో రెండు పాటలను కూడా పాడాడు జీవి ప్రకాష్ కుమార్. జీవి ప్రకాష్ కుమార్ తమిళ్లో చేసిన మద్రాస్ పట్నం సాంగ్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయక్కం ఎన్న సినిమా జీవి ప్రకాష్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది.

అలవైకుంఠపురంలో రేంజ్ 

Advertisement

ప్రస్తుతం జీవి ప్రకాష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వెంకీ అట్లూరి వరుసగా రెండు సక్సెస్ఫుల్ సినిమాలు చేయడంతో ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ముందుగానే వెంకి అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అలవైకుంఠపురం రేంజ్ లో ఉండబోతుంది అని రీసెంట్గా ఫిలిం అవార్డు ఫంక్షన్ హాజరైన జీవి ప్రకాష్ చెప్పాడు.

అవార్డులన్నీ ఆ సినిమాకే 

పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమా ఆకాశంలో ఒక తార. ఈ సినిమా కి కూడా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఒక అద్భుతమైన కథ అని చెప్పాడు. అంతేకాకుండా అన్ని అవార్డ్స్ కూడా ఈ సినిమాకి వస్తాయి అంటూ తన నమ్మకాన్ని వెల్లడి చేశాడు జీవి ప్రకాష్

Advertisement

కుమార్.

ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ కూడా విపరీతంగానే ఆకట్టుకుంది. పవన్ షాదినేని గతంలో సేనాపతి అనే సిరీస్ చేశారు. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు పవన్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయిన కూడా ఇప్పటికీ కొంతమంది ఆ సినిమాను ఇష్టపడుతూ ఉంటారు.

Also Read: Sandeep Reddy Vanga :పోలీస్ గెటప్ లో ప్రభాస్, లీక్ పిక్ తోనే హైప్

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×