E-Paper
Advertisement

Sankranti movies : పండుగకు ఫ్యామిలీతో సినిమా చూడాలి అంటే 15 వేలు ఉండాల్సిందేనా?

Sankranti movies : పండుగకు ఫ్యామిలీతో సినిమా చూడాలి అంటే 15 వేలు ఉండాల్సిందేనా?
Advertisement

Sankranti movies : తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలు చూసినా చూడకపోయినా కూడా సంక్రాంతి సీజన్ లో మాత్రం సినిమాలు చూడకుండా ఉండరు. సంక్రాంతి సినిమా చూడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే చాలామంది నిర్మాతలు తమ సినిమాలు సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు. 2026 సంక్రాంతికి కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ అంచనాలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మీద ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా కొంచెం సీరియస్ మోడ్ లోనే ఉంటాయి. కానీ మెగాస్టార్ లోని కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను బయటకు తీయలేదు. వాల్తేరు వీరయ్య సినిమాలో కొంతమేరకు బాబి మెగాస్టార్ చిరంజీవిలోనే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బయటకు తీశారు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతుంది.

15000 ఉండాల్సిందేనా? 

Advertisement

సంక్రాంతి సీజన్లో విడుదలయ్యే సినిమాలుకు భారీ టిక్కెట్ రేట్లు ఉన్నాయి. రాజాసాబ్ 600,మన శంక‌ర ప్ర‌సాద్ గారు 600,భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి 600,రెండు డ‌బ్బింగ్ సినిమాల‌కు 500, రెండు చిన్న సినిమాల‌కు 500. మొత్తం 2800. అదే ఫ్యామిలీ (న‌లుగురు)తో క‌లిసి చూడాలంటే రూ.11,200. చిరుతిళ్లు కూడా క‌లుపుకొంటే.. రూ. 15,000 వరకు ఖర్చు అవుతుంది.

అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఏమైనా టిక్కెట్ రేట్లు తగ్గించి సినిమాను వదిలితే, అప్పుడు ఆ సినిమాకు మంచి టాక్ వస్తే. సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని కొంతమందికి విపరీతమైన నమ్మకం ఉంది సినిమాను ప్రమోట్ చేయడం కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.

కంటెంట్ ఆకట్టుకుంటుంది 

Advertisement

అనగనగా ఒక రాజు సినిమాకి సంబంధించి కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నవీన్ తన సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదివరకే ఫస్ట్ సింగిల్ భీమవరం వేదికగా విడుదల చేశారు దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ పాటను నవీన్ పోలిశెట్టి పాడారు.

అయితే గతంలో సంక్రాంతి సీజన్ కి వచ్చిన శతమానం భవతి సినిమా మంచి సక్సెస్ సాధించండి. గతంలో ఎవరూ ఊహించిన విధంగా శతమానం భవతి సినిమా సంక్రాంతి సీజన్ లోనే మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు నారి నారి నడుమ మురారి సినిమా అదే స్థాయిలో సర్ప్రైజ్ ఇస్తుందేమో వేచి చూడాలి.

Also Read : Bandla Ganesh: రిలీజ్ ముందు రోజు నిర్మాతను పిలిచి సెటిల్ చేశాడు, అది చరణ్ క్యారెక్టర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×