E-Paper
Advertisement

Movie Titles: టైటిల్ మారితే తిరుగులేని హిట్టే.. సుహాస్ ‘హే బల్‌వంత్’ కూడా అదే బాటలో!

Movie Titles: టైటిల్ మారితే తిరుగులేని హిట్టే.. సుహాస్ ‘హే బల్‌వంత్’ కూడా అదే బాటలో!
Advertisement

Movie Titles: టాలీవుడ్‌లో టైటిల్ మార్పు అనేది ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్‌గా మారిపోయింది. తాజాగా యంగ్ హీరో సుహాస్ తన సినిమా టైటిల్‌ను ‘హే భగవాన్’ నుంచి ‘హే బల్‌వంత్‌’గా మార్చారు. సెన్సార్ బోర్డు సూచనల మేరకు జరిగిన ఈ మార్పు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, మన టాలీవుడ్ చరిత్రలో టైటిల్ మార్చుకున్న సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయనే సెంటిమెంట్ ఉండటంతో, సుహాస్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరి టైటిల్ మార్చుకున్న ఆ హిట్ సినిమాలు మనము ఓ లుక్ వేద్దాం..

సెన్సార్ అభ్యంతరం:

సుహాస్, శివానీ నగరం హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మొదట ‘హే భగవాన్’ అని పేరు పెట్టారు. అయితే ‘భగవాన్’ అంటే దేవుడు అనే అర్థం వస్తుందని, సినిమాలోని కామెడీ కాన్సెప్ట్ మరియు నరేష్ క్యారెక్టరైజేషన్ వల్ల ఎవరి భావాలైనా దెబ్బతినే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. దీనికి తోడు సినిమాలో నరేష్ క్యారెక్టర్ పేరు కూడా మార్చాల్సి వచ్చింది. దీంతో దర్శకుడు గోపీ అచ్చర, నిర్మాత నరేంద్ర రెడ్డి కలిసి ఈ సినిమాకు ‘హే బల్‌వంత్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ, టైటిల్ మారిన తర్వాత మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

టైటిల్ మారితే బ్లాక్ బస్టరే.. టాలీవుడ్ హిస్టరీలో క్రేజీ రికార్డులు:

Advertisement

తెలుగులో టైటిల్ మార్చుకున్న సినిమాలన్నీ దాదాపు ఇండస్ట్రీ హిట్‌లే. ఉదాహరణకు, వరుణ్ తేజ్ ;వాల్మీకి’ వివాదాల వల్ల చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ గా మారి సూపర్ హిట్ అయింది. రామ్ చరణ్ మగధీర కు మొదట ‘డేగ’ అని, ప్రభాస్ మిర్చి కి ‘వారధి’ అని అనుకున్నారు. మహేష్ బాబు ఒక్కడు కు మొదట ‘అతడే ఆమె సైన్యం’ అనే పేరు అనుకున్నా, చివరికి ఒక్కడు గా వచ్చి హిస్టరీ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ ఆర్య 2 కు ‘ఆర్య లాంటి ఫ్రెండ్ ఉంటే’ అని, చిరంజీవి ఠాగూర్ కు ‘సూర్యం’ అని, పవన్ కళ్యాణ్ ఖుషి కి ‘చెలి’ అని మొదట అనుకున్న టైటిల్స్. డిజె టిల్లు కూడా మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరుతోనే స్టార్ట్ అయింది. ఇలా పేర్లు మార్చుకున్నాక వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.

also read:Malavika Mohanan: క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రభాస్ బ్యూటీ.. హీరో, డైరెక్టర్ ఎవరంటే?

సుహాస్ ఖాతాలో మరో హిట్ పక్కా?:

Advertisement

ఇక నేచురల్ నటనతో ఆకట్టుకునే సుహాస్, ఇప్పుడు ఈ టైటిల్ మార్పు సెంటిమెంట్‌ను ఫాలో అవుతుండటం విశేషం. సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి కుతూహలం ఉంది. గతంలో ‘మగధీర’, ‘మిర్చి’ వంటి చిత్రాలు పేర్లు మార్చుకుని ఎలాగైతే ప్రభంజనం సృష్టించాయో, సుహాస్ ‘హే బల్‌వంత్’ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుందాం. ఫిబ్రవరి 20న థియేటర్లలో ఈ హే బల్‌వంత్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×