// // Mega Hero's Unseen Pic's: బాబాయ్ పవన్ తో చెర్రీ చైల్డ్ హుడ్ మెమోరీస్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Mega Hero’s Unseen Pic’s: బాబాయ్ పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్.. అలరారుతున్న నాటి మధుర జ్ఞాపకాలు!

Mega Hero’s Unseen Pic’s: బాబాయ్ పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్.. అలరారుతున్న నాటి మధుర జ్ఞాపకాలు!
Advertisement

Mega Hero’s Unseen Pic’s: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల గురించి పలు విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి కనబరిస్తూ ఉంటారు.. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వారు ఎక్కడ ఉంటారు? ఎలాంటి ప్రదేశాలలో నివసిస్తారు? ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఎలాంటి బట్టలు వేసుకుంటారు? ఇలా కొన్ని విషయాల గురించి ఆరా తీస్తారు.. ఇంకొంతమంది అయితే సెలబ్రిటీలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? ఎవరితో గడిపేవారు? ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు అనడంలో సందేహం లేదు.

రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోలు వైరల్..

టాలీవుడ్లో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan) తన తండ్రి చిరంజీవి(Chiranjeevi ), బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో రామ్ చరణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అరే మా అభిమాన హీరో చిన్నప్పుడు ఇంత అందంగా ఉన్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకవైపు తన తండ్రితో బాబాయితో ఉన్న మధుర జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీటిని చూసిన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ఫోటోలు..

Advertisement

సాధారణంగా రామ్ చరణ్ ఎప్పుడు కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ఉండే అనుబంధం గురించి అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు. దీనికి తోడు ఇప్పుడు ఆ ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఈ ఫోటోలలో అల్లు అర్జున్ కూడా కనిపించడం మరో విశేషం. అలా అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు సంబంధించిన ఈ చిన్న నాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అల్లు అర్జున్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన ఫేస్లో ఎలాంటి మార్పులు రాలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మెగా హీరోలకు సంబంధించి ఎప్పుడూ చూడని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి అవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ALSO READ:Jeevitha Rajasekhar: రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో జాబ్స్.. దిమ్మతిరిగే రియాక్షన్!

మెగా హీరోల సినిమాలు..

Advertisement

రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది . అలాగే చిరంజీవి , బాబి డైరెక్షన్లో బెంగాల్ మాఫియా డాన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ క్రేజ్ సొంతం చేసుకోబోతున్నారని చెప్పవచ్చు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×