// // Double Murder: అర్థరాత్రి వాచ్‌మెన్ దంపతులపై రాడ్లతో అటాక్! -->
E-Paper
Advertisement

Double Murder: పటాన్‌చెరులో కిరాతకం.. అర్థరాత్రి వాచ్‌మెన్ దంపతులపై రాడ్లతో అటాక్!

Double Murder: పటాన్‌చెరులో కిరాతకం.. అర్థరాత్రి వాచ్‌మెన్ దంపతులపై రాడ్లతో అటాక్!
Advertisement

Double Murder: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వాచ్ మేన్‌గా పని చేస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సంగారెడ్డి జిల్లా, ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటీజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద ఈ దారుణం వెలుగుచూసింది. గత కొంతకాలంగా ఇక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న దంపతులను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అర్థరాత్రి సమయంలో నిందితులు రాడ్డుతో తలపై బాదడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Advertisement

మృతులను మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తండాకు చెందిన ధరావత్ సోము (50), ధరావత్ మంగమ్మ (45)గా పోలీసులు గుర్తించారు. వీరు బతుకుదెరువు కోసం గ్రామం నుండి వలస వచ్చి పటాన్‌చెరు సమీపంలోని ఈ నిర్మాణంలో ఉన్న భవనానికి కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నట్లు సమాచారం.

శనివారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పటాన్‌చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు.

Advertisement

ఈ హత్యలు దోపిడీ దొంగతనమా లేక పాత కక్షల నేపథ్యంలో జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో స్థానిక కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Also Read:వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కొండగట్టు సాక్షిగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×