// // Manchu Vishnu: మంచు విష్ణు కొత్త సినిమా ప్రకటన.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Manchu Vishnu: న్యూ ఇయర్ బ్లాస్ట్.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన మంచు విష్ణు..

Manchu Vishnu: న్యూ ఇయర్ బ్లాస్ట్.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన మంచు విష్ణు..
Advertisement

Manchu Vishnu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న కుటుంబాలలో మంచు కుటుంబం కూడా ఒకటి . కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక మోహన్ బాబు వారసులుగా ఆయన పిల్లలు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే విష్ణు ,మనోజ్, లక్ష్మి అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇక గత ఏడాది మంచు హీరోలు మంచి సక్సెస్ సినిమాలను అందుకున్నారనే చెప్పాలి. మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్ట్..

ఇక మంచు విష్ణు విషయానికొస్తే ఈయన కూడా గత ఏడాది కన్నప్ప(Kannappa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా గత ఏడాది జూన్ నెలలో విడుదలైంది అయితే ఇప్పటివరకు విష్ణు తన తదుపరి సినిమాని ఎక్కడ ప్రకటించలేదు అయితే రామాయణం సినిమా చేయాలని భావిస్తున్నట్లు గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలబడలేదు.

10 మినిట్స్ షార్ట్ ఫిలిమ్…

Advertisement

ఇకపోతే నేడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రిటీలు వారి సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ తెలియజేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు సైతం తన తదుపరి సినిమాకి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేయడమే కాకుండా.. న్యూ ఇయర్, న్యూ ఎనర్జీ, బిగ్ థింగ్స్ స్టార్ట్ స్మాల్.. 10 మినిట్స్ షార్ట్ ఫిలిమ్ టూ 10 కోట్ల ఫ్యూచర్ ఫిలిం అంటూ ఈయన తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేయడమే కాకుండా జనవరి 15వ తేదీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించబోతున్నట్లు తెలిపారు.

Advertisement

ఈ విధంగా మంచు విష్ణు తన తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన తెలియజేయడంతో తదుపరి ఏం చేయబోతున్నారనే విషయంపై ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈ పోస్టుపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి విష్ణు ఎలాంటి ప్రకటన తెలియజేయబోతున్నారో తెలియాలి అంటే 15వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక విష్ణు హీరోగా తన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలతో పాటు వ్యాపారాలను యూనివర్సిటీ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

Also Read: MSVPG Film Trailer: మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ ముహూర్తం పిక్స్.. వెన్యూ ఇదే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×