E-Paper
Advertisement

Manchu Lakshmi: మోహన్ బాబు కూతురు కూడా క్యాస్టింగ్ బాధితురాలే… నిద్రలేని రాత్రులంటూ

Manchu Lakshmi: మోహన్ బాబు కూతురు కూడా క్యాస్టింగ్ బాధితురాలే… నిద్రలేని రాత్రులంటూ
Advertisement

Manchu Lakshmi: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న ఎంతోమంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సాధారణంగా మహిళలకు ఇలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్క రంగంలోనూ ఉంటాయి కానీ సినిమా ఇండస్ట్రీలో మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వెళ్లిన హీరోయిన్లకు ఈ ఇబ్బందులు తప్పనిసరిగా ఉంటాయనే సంగతి తెలిసిందే.

ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాను..

ఇలా సామాన్యులకు మాత్రమే కాదు స్టార్ కిడ్స్ సైతం ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలుస్తోంది . తాజాగా మంచు లక్ష్మి సైతం తాను కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న మంచు లక్ష్మి ఇండస్ట్రీలో ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడారు. తాను స్టార్ కిడ్ అయినప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నప్పుడు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నానని తెలిపారు. కాస్టింగ్ కౌచ్ గురించి మంచు లక్ష్మి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

మహిళలపై ఎక్కువ ఒత్తిడి..

Advertisement

ఇక సౌత్ ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీలో మహిళలపై చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుందని, మహిళ శరీరాన్ని వేరొక దృష్టితో చూస్తారని మంచు లక్ష్మి తెలిపారు. కచ్చితంగా ఈ పద్ధతి మారాలంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె ఇలాంటి ఇబ్బందులను ఎక్కడ ఎదుర్కొన్నారు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.. ఇక మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురి విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. స్టార్ కిడ్ అది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెకు ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి వర్ణాతీతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మోహన్ బాబు వారసురాలిగా..

Advertisement

ఇటీవల ఎంతో మంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వస్తూ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వారిని ఇబ్బందులకు గురిచేసిన వారు ఎవరు ఏంటి అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. మంచు లక్ష్మి సైతం ఇబ్బందులకు గురిచేసిన వారి గురించి ప్రస్తావనకు తీసుకురాకుండా తాను కూడా ఇండస్ట్రీలో ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. మంచు లక్ష్మి మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. వరుస సినిమాల ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా దక్ష అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆదరణ నోచుకోలేకపోయింది.

Also Read: Thalaivar 173: రజనీకాంత్‌ను మేం హర్ట్ చేయలేం… సుందర్ తప్పుకోవడంపై కమల్ సంచలన కామెంట్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×