E-Paper
Advertisement

Fertility Issues: సంతాన సాఫల్యంపై ఒత్తిడి పంజా.. స్త్రీలలో గణనీయంగా పడిపోయిన సంతానోత్పత్తి!

Fertility Issues: సంతాన సాఫల్యంపై ఒత్తిడి పంజా.. స్త్రీలలో గణనీయంగా పడిపోయిన సంతానోత్పత్తి!
Advertisement

Fertility Issues: భారత్.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం. అయినా.. మన దేశంలో అధిక సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలు దన్శనం ఇస్తుంటాయి. చాలామంది దంపతులు పిల్లలు లేరని ఆసుపత్రుల చుట్టూ తిరగటం చూస్తుంటాం. దీనికి కారణం.. ప్రస్తుతం చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా కెరీర్ ధ్యాసలో పడి, అప్పుడే పిల్లలెందుకు అని ఆలస్యం చేస్తుంటారు. పురుషులు కూడా ఇదే ధోరణిలో ఉంటూ.. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కనొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడే సంతాన సాఫల్యతను దెబ్బతీస్తుదంటున్నారు నిపుణులు.

గైలకాలజిస్టులు మాట:

సాధారణంగా ఒత్తిడి అనగానే.. దానినొక మానసిక, భావోద్వేగ స్థితిగా మాత్రమే చూస్తున్నాం. కానీ, ఇది అంతకు మించి మన శరీరంలోని జీవక్రియలను అస్తవ్యస్తం చేసే ఒక ప్రధాన భాగం అని గైనకాలజీ నిపుణులు చెబుతున్నారు. యువతపై ఒత్తిడి ప్రభావం అధికంగా ఉండటం వలనే సంతానోత్పత్తి వ్యవస్థ క్షీణించిపోతుందని చెబుతున్నారు.

నేరుగా దాడి చేస్తున్న ఒత్తిడి:

Advertisement

స్త్రీలలో సంతాన సాఫల్యతపైన ఒత్తిడి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. సంతానోత్పత్తిని, అండాశయ నిల్వలను ఒత్తిడి నేరుగా దెబ్బతీస్తున్నట్టు తెలిసింది. చైనాలోని జియాన్ జియావోటాంగ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ అంశంపై పరిశోధన చేయగా.. కొన్ని ఆడ ఎలుకలను భారీ శబ్దాలకు గురిచేసి, అవి ఒత్తిడికి గురయ్యేలా చేశారు. తర్వాత వాటికి పరీక్షలు నిర్వహించగా.. సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజన్, యాంటీ-ములెరియన్ హార్మోన్ల స్థాయులతో పాటు గుడ్ల సంఖ్య, వాటి నాణ్యత కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. స్త్రీల సంతానోత్పత్తి అంశంలోనూ ఒత్తిడి ఇలాంటి ప్రభావాలే చూపిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

తగిన విశ్రాంతి లేకపోవడం:

ఒత్తిడికి గురైన ఎలుకల్లో అండాశయ నిల్వలు తగ్గిపోయాయని, ఫలితంగా వాటి సహజ సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయిందని పరిశోధకులు తెలిపారు. ఈ ఒత్తిడి నేరుగా అండం విడుదల స్త్రీలల్లో నెలసరి చక్రంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో, పని ఒత్తిడి, శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉందట. పీసీఓఎస్, నెలసరి క్రమం తప్పడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో ఒత్తిడే ముఖ్య కారణంగా ఉంటోందని పరిశోధకులు తేల్చారు.

నివారణే ఏకైక మార్గం:

Advertisement

ఈ సమస్యలను అధిగమించడానికి జీవనశైలిలో మార్పులు చేసుకుని, ఒత్తిడిని తగ్గించుకోవడమే మార్గమని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. దీనికోసం వ్యాయామం, యోగా, ధ్యానం, సంపూర్ణమైన నిద్ర, సమతుల్య ఆహారం వంటి నియమాలు పాటించాలని చెబుతున్నారు. ఈ విధానమే ఒత్తిడిని తగ్గించి, హార్మోన్ల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సహాయపడతాయి.ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఏమాత్రం వైద్యులను సంప్రదించాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×