E-Paper
Advertisement

“అసలు వీళ్లని ఎవరు కంటున్నారో.. ?” యువతపై ఫైర్ అయిన బాలీవుడ్ క్వీన్!

“అసలు వీళ్లని ఎవరు కంటున్నారో.. ?” యువతపై ఫైర్ అయిన బాలీవుడ్ క్వీన్!
Advertisement

Kangana Ranaut: కంగనా రనౌత్.. కాంట్రవర్సీకి కేరాఫ్.బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇండియాలో ఏ ఇష్యూ జరిగినా పొలోమంటూ తలదూర్చడం బాగా అలవాటు.ఇదిగో ఆ అలవాటులో భాగంగానే ఇపుడు దేశంలో జెన్ జీ చేస్తున్న నిరసనలని ఉటంకిస్తూ ఈ వెటరన్ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి.

విషయం లోకి వెళ్తే  ఈమధ్య నీట్ పేపర్ లీక్ అయిందంటూ,దానికి బాధ్యుడిగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశంలో యువత రోడ్డ్లమీదకి వచ్చిన సంగతి తెల్సిందే.ఇక నిరసనలకి తట్టుకోలేక ఏకంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  రాజీనామా చేశాడు కూడా.అయితే తాజాగా ఈ నిరసనల్లో యూత్ మాట్లాడుతున్న మాటలని, ప్రవర్తిస్తున్న తీరుని ఉద్దేశిస్తూ కంగనా ఒక రేంజ్ లో ఫైర్ అయింది.

Advertisement

రీల్స్ చూస్తుంటే వాంతి 

ఈ క్రమంలో కంగనా రియాక్ట్ అవుతూ “ఒకే చోట ఇంత అసహ్యకరమైన దృశ్యాలు నేనెప్పుడూ చూడలేదు. ఆ రీల్స్ చూస్తుంటే నాకు వాంతి వచ్చేలా ఉంది. అసలు అందులో వాళ్లు మాట్లాడుతున్న భాష చాలా నీచంగా ఉంది. ఇలాంటి పిల్లలకి జన్మనిచ్చి పెంచుతోంది ఎవరు?”అంటూ మండి పడింది.అంటే కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నిరసన రీల్స్ చూసి బాగా డిస్టర్బ్ అయ్యానని చెప్పుకొచ్చింది.ముఖ్యంగా మన దేశం  నాగరికత, సంస్కృతికి నిలయమని, అలాంటి చోట యువత తమను తాము బొద్దింకలతో పోల్చుకుంటూ ప్రవర్తించడం దారుణమని ఫైర్ అయింది.ఇక ఈ రీల్స్ చూసి  మెంటల్ గా నలిగిపోయానని  తనకు డిజిటల్ డిటాక్స్, కొంత ప్రశాంతత కావాలని మనసులోని ఆవేదనని బయటపెట్టింది.

Advertisement

నిజానికి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసే వారిపై గతంలోనూ ఇలాగే మండి పడింది  కంగనా.గతంలో రైతులు రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేస్తుంటే తప్పు పట్టిన కంగనా అసలు అలాంటి నిరసనలకి ప్రజాస్వామ్యంలో తావు లేదని,అదసలు సరైన పద్దతే కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కంగనా విషయానికి వస్తే

ఇక కంగనా విషయానికి వస్తే 23 మార్చి 1986 న పుట్టిన ఈ భామ పూర్తి పేరు కంగనా అమర్‌దీప్ రనౌత్.హిమాచల్ ప్రదేశ్,మండీ లో పుట్టిన కంగనా ఇటు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే దర్శకత్వంలో సత్తా చాటింది.ముఖ్యంగా హీరోయిన్ గా 2006లో వచ్చిన గ్యాంగ్ స్టర్ తో అడుగుపెట్టిన కంగనాకి ఫ్యాషన్,క్వీన్,తను వెడ్స్ మను,మణి కర్ణిక వంటి సినిమాలు మంచి పేరే తెచ్చాయి.అయితే ఇందితా గాంధి లైప్ ఆధారంగా తాను నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా ఎన్నో రోజులు సెన్సార్ రూముల్లో నలిగి ఎన్నో కట్స్ మధ్య బయటికి వచ్చిన సంగతి తెల్సిందే.

ఇక ఏకంగా నాలుగు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న కంగనా పద్మశ్రీని కూడా దక్కించుకోవడం విశేషం.అయితే సినిమాల్లో సత్తా చాటిన కంగనా గత 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున  పోటీ చేసి ఎంపీగా గెలిచి పాలిటిక్స్ లోనూ తనదైన స్టాంప్ వేయడం విశేషం.

చూడాలి మరి నిరసనలపై తీవ్రమైన కామెంట్స్ చేసిన కంగనా పై జెన్ జీ ఎలా రియాక్ట్ అవుతుందో!

also read :రామ్ చరణ్‌కి సర్జరీ సక్సెస్.. కోయంబత్తూర్ హాస్పిటల్‌లో రిస్కీ ఆపరేషన్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×