E-Paper
Advertisement

Rajendra Prasad: వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్…తమిళంలో సారీ చెప్పిన నటుడు..!

Rajendra Prasad: వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్…తమిళంలో సారీ చెప్పిన నటుడు..!
Advertisement

Rajendra Prasad: ఇటీవల ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన ఒక వ్యాఖ్య తమిళ సినీ ప్రేక్షకు ఆగ్రహానికి గురిచేసింది. తమిళ సినీ ప్రపంచానికి చెందిన దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గురించి.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పరిస్థితి తీవ్రంగా మారడంతో రాజేంద్ర ప్రసాద్ చివరికి క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ముఖ్యంగా ఆ వీడియోలో ఆయన తమిళంలో మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది.

కారణం అదే..!

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన “కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు” కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు… ఆ వేడుకలో ఆయన కాంతారావు గురించి మాట్లాడుతుండగా ఎంజీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. కాంతారావు గొప్ప నటుడు అని చెప్పే సందర్భంలో ఎంజీఆర్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు కొందరికి అవమానకరంగా అనిపించాయి. ముఖ్యంగా తమిళ అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.

Advertisement

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు, కొందరు ప్రముఖ నటులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ హీరో విశాల్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ తన అసంతృప్తిని తెలియజేశాడు. ఎంజీఆర్ తమిళ ప్రజలకు కేవలం నటుడే కాకుండా గొప్ప నాయకుడు కూడా అని ఆయన పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

Advertisement

అదేవిధంగా ప్రముఖ నటుడు నాజర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. తెలుగు సినీ పరిశ్రమను.. తాము ఎంతో గౌరవిస్తామని ఆయన చెప్పారు. కానీ ఎంజీఆర్ లాంటి గొప్ప వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో వివాదం మరింత పెద్దది అయింది.

తమిళంలో సారీ..!

ఈ విమర్శలు పెరుగుతుండటంతో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన ఒక వీడియో విడుదల చేసి తమిళ ప్రజలకు, సినీ పరిశ్రమకు క్షమాపణలు చెప్పారు. తాను ఎంజీఆర్ గురించి కావాలని అలా మాట్లాడలేదని తెలిపారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా మాట జారి అలా జరిగిపోయిందని చెప్పారు. ఎంజీఆర్ వంటి గొప్ప వ్యక్తిని అవమానించే ఉద్దేశం తనకు అసలు లేదని స్పష్టం చేశారు.

ఆ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ చేతులు జోడించి క్షమాపణలు కోరారు. తాను కూడా తమిళ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నానని చెప్పారు. తమిళ సినిమా పరిశ్రమకు తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. ఎవరి మనసును నొప్పించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ ఉండదని చెప్పారు.

ఇప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కొందరు ఆయన నిజాయితీగా క్షమాపణ చెప్పారని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ప్రముఖులు కూడా ఈ వివాదం ఇక్కడితో ముగియాలని సూచిస్తున్నారు.

సినీ ప్రపంచంలో ప్రముఖులు చేసే ప్రతి మాట ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే పబ్లిక్ వేదికలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. రాజేంద్ర ప్రసాద్ చేసిన క్షమాపణతో ఈ వివాదం కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ: Movie Ticket Rates: సినిమా టికెట్ పెంపుపై ట్విస్ట్.. తెలంగాణ హైకోర్టు ఆదేశాన్ని నిలిపిన సుప్రీంకోర్టు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×