E-Paper
Advertisement

దళపతి విజయ్ ఆఖరి వేట: ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్ ?

దళపతి విజయ్ ఆఖరి వేట: ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్ ?
Advertisement

Jananayagan Release:ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాల పాట పాడుతున్న జననాయగన్  ఎట్టకేలకి విడుదల అయ్యేందుకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తుంది.అవును సెన్సార్ వివాదాలు కోర్టు కేసులు ఆన్లైన్ లీకులు వంటి ఎన్నో అడ్డంకులు దాటుకొని ఈ మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి రావడానికి రెడీ అయిపోయిందని ఫిలింనగర్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది .ఇక వినిపిస్తున్నట్టుగా ఈ సినిమా జులై 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా ఒకరోజు ముందుగానే అంటే జులై 23 నుంచి ఇండియాలో సందడి మొదలు కానుందని  ఇన్ సైడ్ టాక్.

ఓవర్సీస్ లోను అప్పుడే అడ్వాన్స్ బుకింగ్

Advertisement

దళపతి విజయ్ కెరీర్ లో 69వ సినిమాగా వస్తున్న ఈ జననాయగన్  కోసం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ జోరు అందుకున్నాయని కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.వాస్తవానికి ఈ పొలిటికల్ డ్రామాని  ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్.కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBFC తో సెన్సార్ సర్టిఫికేషన్ వివాదం కారణంగా దాదాపు 7 నెలలపాటు ఈ సినిమా ల్యాబ్ లోనే మగ్గిపోయింది.ఇక తాజాగా జూలై 9న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తికాగా ఈ సినిమాకి A సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం.ముందుగా సెన్సార్ బోర్డ్ చెప్పినట్టుగా దాదాపు 12 మేజర్ చేంజెస్ ని మేకర్స్ పూర్తి చేసిన తర్వాతే ఈ సర్టిఫికెట్ లభించినట్టు తెలుస్తుంది.

also read :సుప్రీంకోర్టుకు చేరిన బండ్ల గణేశ్ ఆస్తుల వివాదం.. వచ్చే సోమవారం ఏం జరగనుందో ?

Advertisement

విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో

ఇక  అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమాకి కొన్ని మార్పు చేర్పులు చేసి విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని హెచ్ వినోద్ కిరాక్ తెరకెక్కించాడని సమాచారం .దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో 3 గంటల 3 నిమిషాల 11 సెకన్ల నిడివితో వస్తున్న ఈ సినిమాలో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబి డియోల్  కనిపించనున్నాడు అలాగే మమత బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణిలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

విజయ్ కి ఎలాంటి మెమోరీస్ ని మిగులుస్తుందో!

ఇక ఇప్పటికే రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా పెట్టేసుకున్నారు మూవీ లవర్స్ .కాగా ఈ సినిమా కి తమిళనాడు ఉదయం ఐదు గంటల స్పెషల్ షో ఉండే అవకాశం లేదని మొదటి షో ఉదయం 9 గంటలకే మొదలవుతుందని తెలుస్తోంది .అయితే ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ, కర్ణాటక  రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి ఉన్న డిమాండ్ కారణంగా ఉదయం 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు వేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయట.

also read :సల్మాన్ చాలా మంచోడబ్బా.. మిగతా హీరోలే .. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్ !

ఏదేమైనా విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు విజయ్ కి సాలిడ్ గా ఫేర్వెల్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.చూడాలి మరి ఏడు నెలలుగా  పూరిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తలపతి విజయ్ కి ఎలాంటి మెమోరీస్ ని మిగులుస్తుందో!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×