// // Budget Electric Scooters: మిడిల్ క్లాస్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. జస్ట్ రూ.50 వేల లోపే కొనేయెచ్చు! -->
E-Paper
Advertisement

మిడిల్ క్లాస్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. జస్ట్ రూ.50 వేల లోపే కొనేయెచ్చు!

మిడిల్ క్లాస్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. జస్ట్ రూ.50 వేల లోపే కొనేయెచ్చు!
Advertisement

Top Budget EV Scooters 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తక్కువ ఖర్చులో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రోజూ తక్కువ దూరాలు ప్రయాణించే వారికి రూ.50 వేలలోపు లభించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆప్షన్ గా మారుతున్నాయి. వీటికి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం మరో ప్లస్ పాయింట్ గా ఉన్నాయి. గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్లు నగరాల్లో రోజువారీ అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు కూడా వీటిని ఇబ్బంది లేకుండా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా సాధారణ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రూ. 50 వేల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు చూద్దాం..

1.కోమాకి X వన్

బడ్జెట్ ధరలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న స్కూటర్లలో కోమాకి X వన్ ఒకటి. దీని ప్రారంభ ధర సుమారు రూ.34,999 నుంచి ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రోజువారీ ప్రయాణాలకు ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

2.యాకుజా రూబీ

Advertisement

యాకుజా రూబీ కూడా తక్కువ ధరలో లభించే మరో ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర సుమారు రూ.38,080. సింపుల్ డిజైన్, తక్కువ మెయింటెన్స్ ఖర్చు ఈ మోడల్‌ కు ప్లస్ పాయింట్లు.

3.యాకుజా నియు  

యాకుజా కంపెనీ నుంచి వచ్చే మరో మోడల్ నియు. దీని ధర సుమారు రూ.39,760. నగరాల్లో తక్కువ దూర ప్రయాణానికి అనువుగా రూపొందించారు. తక్కువ బడ్జెట్‌ లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇదో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

4.కోమాకి XGT KM

Advertisement

కోమాకి XGT KM ధర సుమారు రూ.43,749. ఆకట్టుకునే డిజైన్‌ తో పాటు రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆఫీస్ కు, మార్కెట్‌ కు, సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ స్కూటర్ ఉపయోగపడుతుంది.

5.తున్వాల్ మిని లిథినో  

తున్వాల్ మిని లిథినో  ధర దాదాపు రూ.44,000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోరుకునే వారికి ఇది మరో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈజీ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, తక్కువ మెయింటెన్స్ ఖర్చు తో ఈ మోడల్ ఆకట్టుకుంటోంది.

కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

స్కూటర్ కొనుగోలు చేసే ముందు బ్యాటరీ రకం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే వచ్చే రేంజ్, ఛార్జింగ్ సమయం, సర్వీస్ సెంటర్ల అందుబాటు, వారంటీ లాంటి శాలను తప్పనిసరిగా పరిశీలించాలి.  రోజువారీ ప్రయాణ దూరానికి సరిపోయే మోడల్‌ను ఎంచుకుంటే మంచిది. లో స్పీడ్ వాహనాలు కావడంతో లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా సిటీ ప్రయాణాలను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన మోడల్‌ను ఎంచుకుంటే ప్రయాణ ఖర్చులను భారీగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

Read Also: పెట్రోల్ నుంచి EVకి మారాలనుకుంటున్నారా? అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×