E-Paper
Advertisement

‘పెద్ది’ నుంచి ‘సోల్ ఆఫ్ అప్పలసూరి’.. జగపతిబాబు గ్లింప్స్ మామూలుగా లేదుగా!

‘పెద్ది’ నుంచి ‘సోల్ ఆఫ్ అప్పలసూరి’.. జగపతిబాబు గ్లింప్స్ మామూలుగా లేదుగా!
Advertisement

Peddi Glimpse : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ క్లాసిక్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ మళ్లీ పల్లెటూరి నేపథ్యంలో నటిస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ సర్కిల్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది.

also read :మహేష్ బాబు రెస్టారెంట్‌లో ఘోరమైన దోపిడీ.. బిల్లు చూస్తే గుండె ఆగాల్సిందే!

Advertisement

‘అప్పలసూరి’ అనే పవర్ ఫుల్ రోల్

సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు, టాలీవుడ్ జగపతిబాబుకు సంబంధించిన ‘సోల్ ఆఫ్ అప్పలసూరి’ గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మెప్పించి, ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా పవర్‌ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు, ఈ చిత్రంలో ‘అప్పలసూరి’ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు. కేవలం లుక్‌తోనే భయాన్ని, అదే సమయంలో ఒక బలమైన లక్ష్యం కోసం తపించే ఒక మనిషి ఆవేదనను జగపతిబాబు అద్భుతంగా పలికించారు. మూవీ టీమ్ అన్నట్టుగా, ఇది కేవలం పాత్ర పరిచయం మాత్రమే కాదు, కథను మలుపు తిప్పే ఒక ఎమోషనల్ రైడ్ అని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది.

Advertisement

సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం

‘పెద్ది’ అనే టైటిల్ వినడానికి ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో, సినిమాలోని క్యారెక్టరైజేషన్లు కూడా అంతే రా అండ్ రస్టిక్‌గా ఉండబోతున్నాయని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చాయో, నటుడిగా ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ‘పెద్ది’ నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్.
ముఖ్యంగా బుచ్చిబాబు సానా తన తొలి చిత్రం ‘ఉప్పెన’లో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను ప్రెజెంట్ చేసిన విధానం, విజయ్ సేతుపతి లాంటి నటుడి నుంచి పండించిన విలనిజం చూసిన ఎవరికైనా, ఇప్పుడు రామ్ చరణ్, జగపతిబాబు లాంటి హేమాహేమీలను ఆయన ఎలా హ్యాండిల్ చేసి ఉంటారా అన్న క్యూరియాసిటీ కనిపిస్తుంది.

జూన్ 4న  థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల గేర్ మార్చింది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ లోపే ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించేందుకు మే 18 నుంచి ‘పెద్ది’ ట్రైలర్ ఈవెంట్స్ మరియు కౌంట్‌డౌన్ ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ఈ ట్రైలర్ లాంచ్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి జూన్ 4న చరణ్ ఎలాంటి బీభత్సం స్ప్రుష్టిస్తాడో !

also read :సైలెంట్‌గా ఉంటే రెచ్చిపోతారా..? వల్గర్ కామెంట్‌పై కన్నడ బ్యూటీ ఫైర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×