E-Paper
Advertisement

Allari Naresh : అలాంటివాళ్లను నాగార్జున ఎంకరేజ్ చేయరు, దూరంగా పొమ్మంటారు

Allari Naresh : అలాంటివాళ్లను నాగార్జున ఎంకరేజ్ చేయరు, దూరంగా పొమ్మంటారు
Advertisement

Allari Naresh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో అల్లరి నరేష్ ఒకరు. అల్లరి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా సక్సెస్ సాధించడంతోనే నరేష్ కు ఇంటిపేరులా మారిపోయింది. ఆ సినిమాతో దర్శకుడు రవిబాబు కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. దాదాపు 50 సినిమాలకు పైగా తన కెరీర్లు పూర్తి చేసుకున్నాడు నరేష్. ప్రతి హీరోకి అభిమాన హీరో ఉండటం అనేది సహజంగా జరుగుతుంది.

నరేష్ విషయానికి వస్తే యువసామ్రాట్ నాగార్జున అంటే నరేష్ కు విపరీతమైన ఇష్టం. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అతను విపరీతంగా ఇష్టపడుతుంటారు నరేష్. అయితే నాగర్జున మీద ఇష్టం పుట్టడానికి అసలైన కారణం ఏంటో రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నరేష్.

అలాంటి వాళ్లను దూరం పెడతారు 

Advertisement

నాగార్జున గారు కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా చాలా హుందాగా ఉంటారు. ఆయన నడుచుకునే విధానం, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కూడా నేను విపరీతంగా ఇష్టపడతాను. నేను ఆయనతో వర్క్ చేశాను కాబట్టి చెబుతున్నాను ఆయన అసలు నెగిటివ్ మాట్లాడరు.

నాగార్జున చాలా పాజిటివ్ గా ఉంటారు. ఒకవేళ నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్లని దగ్గరకు రానివ్వరు. పోయి దూరంగా కూర్చో అంటుంటారు. నామీద ఆయన బాగా ప్రభావితం చూపించారు అందుకే నేను విపరీతంగా నాగార్జునను ఇష్టపడతాను అని అల్లరి నరేష్ చెప్పారు.

నాగార్జున పై ఇష్టం అలా మొదలైంది

Advertisement

మద్రాస్ లో ఉన్నప్పుడు మా సినిమాకి పనిచేసిన వాళ్ళు గీతాంజలి సినిమాకు టికెట్ ఇచ్చారు. నేను ఆ సినిమా చూడడానికి వెళ్లాను నాగార్జున గారిని చూసి ఫిదా అయిపోయాను. సినిమా అంతా ఊటీలో జరుగుతుంది కాబట్టి నేను కూడా ఊటీలో ఉన్నట్లే ఫీలయ్యాను.

ఆ సినిమా తర్వాత శివ సినిమా చూసినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. క్యాసెట్ తెచ్చుకొని సినిమాను పదే పదే చూశాను. కొన్ని సందర్భాలలో ఆ సినిమా చూసినప్పుడు భయం కూడా వేసింది. ఆ సినిమాలో రఘువరన్ రెండు లారీల జనాన్ని తీసుకెళ్లి అని డైలాగ్ చెబుతూ ఉంటే మా హీరో ని చంపేస్తాడేమో అని భయం వేసేది.

Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఆ రేంజ్ లో ఉందా? ఉపేంద్ర మాటలు వెనక ఆంతర్యం ఏంటి?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×