E-Paper
Advertisement

Telugu Heros: ఒకే సంవత్సరంలో 12 మంది హీరోల పరిచయమయ్యారు, ఇండస్ట్రీలో ప్రస్తుత పొజిషన్

Telugu Heros: ఒకే సంవత్సరంలో 12 మంది హీరోల పరిచయమయ్యారు, ఇండస్ట్రీలో ప్రస్తుత పొజిషన్
Advertisement

Telugu Heros: ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం నడుస్తుంది అని చెబుతూ ఉంటారు. రోజులన్నీ ఒకేలా ఉండవు అనేది కూడా వింటూనే ఉంటాము. జీవితంలో ఎత్తు పల్లాలు ఎలా అయితే సహజంగా జరుగుతుంటాయో, గెలుపు ఓటమిలు కూడా అంతే. ఎవరి జీవితాన్ని ఎవరూ పెద్దగా డిసైడ్ చేయలేరు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ ప్రతిభను కనపరిచి మంచి పేరు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో చాలామంది ఇంటర్ ఇస్తుంటారు. వాళ్లలో కొంతమంది సక్సెస్ అవుతారు ఇంకొంతమంది సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు.

ఎక్కువగా ఇండస్ట్రీలో నెపోటిజం జరుగుతుంది అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. నెపోటిజం అనేది పెద్ద సమస్య కూడా కాదు అనేది కొంతమంది అభిప్రాయం. ఎంత స్టార్ కిడ్ అయినా కూడా ఫస్ట్ డే సినిమా నచ్చకపోతే ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు అనడానికి ఉదాహరణలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలా ఉన్నాయి. ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మంచి కథలను ఎంచుకొని తమ టాలెంట్ చూపిస్తే వాళ్లను కూడా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పడానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి.

2002లో ఏకంగా 12 మంది 

Advertisement

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేవలం 2002 సంవత్సరంలోనే ఏకంగా 12 మంది హీరోలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేష్, తారకరత్న, ప్రభాస్, ఆర్యన్ రాజేష్, నితిన్ ఇలా చాలామంది అదే సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

వారిలో ప్రస్తుతం అల్లరి నరేష్, ప్రభాస్, నితిన్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రభాస్ రేంజ్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

మొదటి సినిమా అందరూ ప్రేమ కథలను యాక్షన్ స్టోరీస్ ను ఎంచుకుంటే డిఫరెంట్ గా ఒక కామెడీ ఫిలిం ఎంచుకున్నారు నరేష్. ఆ సినిమా సక్సెస్ అవడంతో ఎక్కువగా అటువంటి పాత్రలకే ప్రాముఖ్యత ఇచ్చే సినిమాలు చేశాడు. మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం వంటి సినిమాలు కూడా అల్లరి నరేష్ కెరీర్ కు మంచి ప్లస్ పాయింట్ గా మారాయి.

అల్లు అర్జున్ రేంజ్ లో నితిన్ 

తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గతంలో దిల్ రాజు మాట్లాడుతూ అల్లు అర్జున్ నువ్వు కూడా ఒకేసారి మొదలయ్యారు. నేను అప్పుడు మీ ఇద్దరినీ అనుకున్నాను. మీరు ఫ్యూచర్లో ఎక్కడో ఉండబోతారు అని. బట్ బన్నీ ఈరోజు ఏ రేంజ్ లో ఉన్నాడో మనందరికీ తెలుసు. నీకు నేను ఊహించిన రేంజ్ రాలేదు అని నితిన్ డైరెక్ట్ గా అడిగేసారు దిల్ రాజు.

దానికి నితిన్ కూడా చాలా తెలివైన సమాధానం చెప్పాడు. మీ తమ్ముడు సినిమాతో అని ప్రస్తావిస్తూ తమ్ముడు సక్సెస్ఫుల్ ఫిలిమ్ అవుతుంది తర్వాత ఎల్లమ్మతో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది అని దిల్ రాజు అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్టు నుంచి కూడా నితిన్ పక్కకు తప్పుకున్నాడు. ఇంకా ఫ్యూచర్లో వీళ్ళ కెరియర్ ఎలా ఉండబోతుందో అనేది వాళ్ళ నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది.

Also Read: Allari Naresh : అలాంటివాళ్లను నాగార్జున ఎంకరేజ్ చేయరు, దూరంగా పొమ్మంటారు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×