E-Paper
Advertisement

IBomma in SBI : ఇంకా చావని ఐబొమ్మ.. ఏకంగా SBI సైట్‌లో ప్రత్యేక్షం

IBomma in SBI : ఇంకా చావని ఐబొమ్మ.. ఏకంగా SBI సైట్‌లో ప్రత్యేక్షం
Advertisement

IBomma in SBI : ఐబొమ్మ రవి(Ibomma Ravi) ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను పైరసీ చేస్తూ భారీగా సంపాదించారు. అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఇతనిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా సంచలనమైన విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం నిర్గాంత పోతున్నారు. రెండవ రోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ ఏకంగా ఎస్.బి.ఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Term Life Insurance)పోర్టల్ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అధికారులు కూడా షాక్ అయ్యారు. ఇలాంటి ఒక పైరసీ వెబ్ సైట్ ప్రధాన బ్యాంకింగ్ పోర్టల్ లో కనిపించడం భద్రత వైఫల్యానికి నిదర్శనం అనే చెప్పాలి. ఈ విధంగా ఎస్.బి.ఐ పోర్టల్ లో ఐ బొమ్మ ప్రత్యక్షం కావడంతో అధికారులు దర్యాప్తును మరింత లోతుగా నిర్వహిస్తున్నారు.

ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు..

ఈ విధంగా ఎస్.బి.ఐ పోర్టల్ లో ఐ బొమ్మ లింక్ కనిపించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే ఎస్.బి.ఐ సాంకేతిక బృందాన్ని పిలిపించి నిర్ధారణ చేసుకున్నారు. ఇలా ఎస్.బి.ఐ సాంకేతిక బృందం తమ బ్యాంకు పోర్టల్ లో ఐ బొమ్మ లింక్ ఉందని నిర్ధారించిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అలాగే ఎస్.బి.ఐ పోర్టల్ నుంచి ఈ లింకు తొలగించడం కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇలా సినిమాలను పైరసీలకు మాత్రమే కాకుండా ఏకంగా బ్యాంక్ పోర్టల్ లో కూడా ఐ బొమ్మ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అధికారులు షాక్ లో ఉండిపోయారు.

రవి కోసం లాయర్ సలీం..

Advertisement

ఇక ఈ విచారణలో భాగంగా ఇమ్మడి రవి నుంచి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో తెలియాల్సి ఉంది. మొత్తం ఐదు రోజులపాటు పోలీసు విచారణకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు విచారణలో భాగంగా ఈ నిర్గాంత పోయే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇమ్మడి రవికి 14 రోజులు పాటు రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ ముగియబోతున్న నేపథ్యంలో ఈయన తరపున వాదించడం కోసం లాయర్ సలీం(Lawyer Saleem) రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

శిక్ష మరింత పెరుగుతుందా?

Advertisement

ఇమ్మడి రవికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఫ్రీగానే తాను ఈ కేసు వాదిస్తానని లాయర్ సలీం చెప్పడంతో సోషల్ మీడియా వేదికగా లాయర్ సలీంకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఎలాగైనా ఈ కేసు నుంచి బెయిల్ మీద తనని బయటకు తీసుకురావాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అవసరమైతే ఈ కేసుకు ఫీజు తీసుకోండి అది మేమే ఇస్తాము అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్న నేపథ్యంలో ఇమ్మడి రవికి ఏ స్థాయిలో మద్దతు ఉందో స్పష్టమవుతుంది. మరి ఈ కేసు నుంచి రవి బయటపడతారా? ఇలాంటి కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో ఈయన శిక్ష మరింత పెరుగుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Bhagya Shri Borse: అలాంటి పాత్రలలో చేయటమే నా కల.. భాగ్య శ్రీ కోరికలు మామూలుగా లేవే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×