E-Paper
Advertisement

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో ధురంధర్ నటుడు.. క్రేజీగా ప్లాన్ చేసిన డైరెక్టర్!

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో ధురంధర్ నటుడు.. క్రేజీగా ప్లాన్ చేసిన డైరెక్టర్!
Advertisement

Jr.NTR -Neel: టాలీవుడ్ స్టార్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాది నుంచి షూటింగ్ పనులను ప్రారంభించినప్పటికీ చాలా ఆలస్యంగానే షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది . ఇప్పటివరకు కేవలం 40 శాతం షూటింగ్ పనులు మాత్రమే పూర్తి అయ్యాయని సమాచారం. ఇక ఈ సినిమాను 2027 సంవత్సరంలో విడుదల చేయడం కోసం ప్రశాంత్ నీల్ (Prashanth Neel)ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కోసం రంగంలోకి ధురంధర్ నటుడు..

ఇక ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ ఏ విధమైనటువంటి అప్డేట్స్ వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ధురంధర్ (Dhurandhar) నటుడు బిమల్ ఒబెరాయ్ (Bimal oberoi)నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయాన్ని స్వయంగా నటుడు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియచేయడ విశేషం. బిమల్ ఒబెరాయ్ ధురంధర్ సినిమా మొదటి భాగంలో తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బిమల్ ఫోటోషూట్ కూడా పూర్తి..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈయన నటనకు ఫిదా అయినా డైరెక్టర్ ప్రశాంత్ ఏకంగా తనకు ఫోన్ చేసి మరి ఎన్టీఆర్ (NTR)సినిమాలో అవకాశం కల్పించారని తెలియజేశారు. ఈ సందర్భంగా బిమల్ ఒబెరాయ్ మాట్లాడుతూ..ధురంధర్ సినిమా విడుదలైన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా కోసం తనని సంప్రదించారని అలాగే తనపై ఫోటోషూట్ కూడా చేశారని బిమల్ తెలిపారు. ఫోటోషూట్ కూడా ఓకే అయిందని ఇలా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వంటి స్టార్స్ సినిమాలో తనకు అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

నెగిటివ్ పాత్రలో ధురంధర్ నటుడు?

Advertisement

ఇలా ఎన్టీఆర్ సినిమాలో ధురంధర్ నటుడు నటించబోతున్న విషయం గురించి ఆయన స్వయంగా చెప్పడంతో ఎలాంటి పాత్రలో నటించబోతున్నారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి ఈయన నెగిటివ్ పాత్రలో నటించబోతున్నారా? ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఈయన పాత్ర ఉండబోతుందా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇలా ఈ సినిమాలో ధురంధర్ నటుడు నటించబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రశాంత్ ఈ సినిమాని భారీగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.

Also Read: క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎన్నారై యువతికి వేధింపులు.. నిర్మాత బాగోతం బట్టబయలు?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×