E-Paper
Advertisement

Prasad Behara : ఒక అమ్మాయి నమ్మి మోసపోయాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రసాద్ స్టోరీ..

Prasad Behara : ఒక అమ్మాయి నమ్మి మోసపోయాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రసాద్ స్టోరీ..
Advertisement

Prasad Behara : మీడియా ద్వారా ఎంతో మంది పాపులర్ అవుతారు అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ లేదా యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.. ఇలా ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకుంటూ సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం కమెడియన్లుగా సినిమాలు చేస్తున్న ఎంతోమంది అలానే ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నారు.. అలాంటి కమెడీయన్లలో ప్రసాద్ బెహరా ఒకరు.. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కామెడీతో ఫేమస్ అయిన ఇతను ఈ మధ్య వార్తలు ఎక్కువగా నిలుస్తున్నాడు.. తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

అమ్మాయిని నమ్మి మోసపోయాను..

కమెడియన్ ప్రసాద్ బెహరా ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్న ప్రసాద్ ఒక అమ్మాయి వల్ల తన జీవితం నాశనం అయ్యింది అన్న విషయాన్ని కూడా బయటపెట్టారు. కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో నవ్వించే ప్రసాద్… ఈసారి మాత్రం తన జీవితంలోని నమ్మక ద్రోహాల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పనిమనిషిని కుటుంబ సభ్యురాలిలా చూసుకున్నా.. తనకి కావలసిన విధంగా అన్ని సమకూర్చాను.. కానీ నన్ను నిండా ముంచేసింది అని అతను ఎమోషనల్ అయ్యాడు.. జీవితంలో మరోసారి ఇలా మోసపోకూడదు అని అందరికీ హితబోధ చేశాడు. ఆ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజెన్లు ఇంకొకసారి అమ్మాయిలు వల్ల మోసపోకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు కౌంటర్.. ఉద్యోగంలో చేరిన సత్యం.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..

ప్రసాద్ సినిమాల విషయానికొస్తే.. 

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ లలో తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు ప్రసాద్. టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించుకున్న ప్రసాద్ సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంటూ వచ్చాడు. నిహారిక కొణిదల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రంలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ సినిమా మంచి టాక్ ని అందుకోవడంతో అతనికి అవకాశాలు కూడా వరుసగా వస్తున్నాయి. ఇక ప్రస్తుతం పాపం ప్రతాప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ మూవీ అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీతో ప్రసాద్ క్రేజ్ ఏ మాత్రం పెరుగుతుందో చూడాలి.. ఇకపోతే ప్రసాద్ యూట్యూబ్ వీడియోలను చేస్తూ బిజీగానే ఉంటున్నాడు. దీంతో పాటుగా ఆయనకు మరికొన్ని సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రసాద్ కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×