E-Paper
Advertisement

ఫ్యామిలీ భద్రతకు బెస్ట్ కార్లు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ టాప్ మోడల్స్ ఇవే!

ఫ్యామిలీ భద్రతకు బెస్ట్ కార్లు..  5 స్టార్ సేఫ్టీ రేటింగ్ టాప్ మోడల్స్ ఇవే!
Advertisement

Top 5 Secure Cars in India: ఈ రోజుల్లో చాలా మంది కారు కొనుగోలు చేసే సమయంలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కారును ఎంచుకోవడం ద్వారా ప్రయాణికులు మరింత నమ్మకంగా, భద్రంగా ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ న్యూ కార్ అసెస్‌ మెంట్ ప్రోగ్రామ్(Bharat NCAP) కింద 5 స్టార్ రేటింగ్ పొందిన టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హ్యుందాయ్ వెన్యూ

పాపులర్ హ్యుందాయ్ మోడల్ వెన్యూ కారు పెద్దల రక్షణలోనే కాదు, పిల్లల భద్రతలో కూడా మంచి స్కోర్ సాధించింది. ముఖ్యంగా ఎయిర్‌ బ్యాగ్‌లు, బలమైన బాడీ నిర్మాణం, ఆధునిక సేఫ్టీ టెక్నాలజీతో తన సెగ్మెంట్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

⦿ కియా సెల్టోస్

Advertisement

ఆ తర్వాత కియా సెల్టోస్ కూడా 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో ముఖ్యమైన మోడల్. ఈ కారు పెద్దల రక్షణలో అత్యధిక స్కోర్‌ పొందింది. పిల్లల భద్రతలో కూడా మంచి మార్కులు సాధించింది. లేటెస్ట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, బలమైన నిర్మాణం ఈ కారులో ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు.

⦿ న్యూ టాటా సియెర్రా

టాటా సియెర్రా కొత్త వెర్షన్ కూడా భద్రత పరంగా మంచి పనితీరును కనబరిచింది. పెద్దలు, పిల్లల రక్షణ రెండింటిలోనూ ఇది మంచి స్కోర్ సాధించింది. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, భద్రతా ఫీచర్లలో కూడా ముందుంది.  పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ ఆప్షన్‌లతో రావడం కూడా అదనపు ఆకర్షణను సంతరించుకుంది.

⦿ విన్‌ఫాస్ట్ VF6

Advertisement

విన్‌ఫాస్ట్ VF6 ఎలక్ట్రిక్ కారు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. భద్రతా పరీక్షల్లో మంచి రేటింగ్ సాధించింది. భారత మార్కెట్లోకి కొత్తగా వచ్చినప్పటికీ, భద్రత విషయంలో మంచి రేంజ్ ను అందుకుంది.

Read Also: తెలుగోడి అద్భుత సృష్టి ఈ మినీ కారు, ఇంతకీ మార్కెట్ లోకి ఎందుకు రాలేదు?

⦿ మారుతి సుజుకి ఇ-విటారా

మారుతి సుజుకి ఇ-విటారా కూడా 5 స్టార్ రేటింగ్ పొందిన మరో ఎలక్ట్రిక్ SUV. పెద్దలు, పిల్లల రక్షణలో మంచి స్కోర్‌ సాధించడం వల్ల ఇది కుటుంబాల కోసం సురక్షితమైన ఎంపికగా నిలుస్తోంది. మారుతి బ్రాండ్‌ కు ఉన్న నమ్మకం కూడా దీనికి అదనపు బలం.

ఈ టాప్ 5 కార్లు భద్రతలో మంచి ప్రమాణాలను కలిగి ఉన్నాయి. కేవలం ధర, డిజైన్ మాత్రమే కాకుండా, భద్రతకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంతో ప్రయాణించే వారు, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ వాహనాలను సెలెక్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: ఫీచర్లలో విన్‌ఫాస్ట్ VF3 సూపర్.. కానీ, ఇండియాలో హిట్ కొట్టేనా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×