E-Paper
Advertisement

MSVPG: భారీ ధరకు’మన శంకర ప్రసాద్ గారు’ నాన్ థియేట్రికల్ రైట్స్..పెట్టుబడి వచ్చేసిందిగా?

MSVPG: భారీ ధరకు’మన శంకర ప్రసాద్ గారు’ నాన్ థియేట్రికల్ రైట్స్..పెట్టుబడి వచ్చేసిందిగా?
Advertisement

MSVPG: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ తరుణంలోనే షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని త్వరలోనే ఈ షెడ్యూల్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా చివరి దశ షూటింగ్ కు చేరుకున్న నేపథ్యంలో సినిమా బిజినెస్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

నాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న జీ సమస్థ..

ఈ క్రమంలోనే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున అమెజాన్, హాట్ స్టార్,జీ 5 వంటి సంస్థలు పోటీపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ జీ సమస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. జీ5,జీ టీవీ ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు సొంతం చేసుకున్నారట. దాదాపు ఈ ధరలతో సినిమాకు పెట్టుబడి దాదాపు వెనక్కి వచ్చేసినట్టు ఇండస్ట్రీకి సమాచారం. ఇలా శంకర ప్రసాద్ గారు సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి కావడంతో థియేట్రికల్ బిజినెస్ కూడా ఇంతకుమించి జరగబోతుందని తెలుస్తోంది.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్..

Advertisement

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలేవి కూడా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచలేదు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలో శంకర వరప్రసాద్ గారిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్న నేపథ్యంలో మంచి అంచనాలే ఉన్నాయి.

చిరంజీవికి జోడిగా నయనతార..

Advertisement

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార (Nayanatara)నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని గోల్డెన్ బాక్స్ ,షైన్ స్క్రీన్స్ బ్యానర్లపై సాహు గారిపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మీసాల పిల్లా అనే పాట భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఉన్న బజ్ చూస్తుంటే వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ సినిమాని అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి విడుదల తేదీ అలాగే ఇతర అప్డేట్స్ కూడా వరుసగా రానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Mammootty: ఈయన వల్లే మహమ్మద్ కుట్టి నుంచి మమ్ముట్టిగా మారా.. స్టేజ్‌పైనే అసలు నిజం చెప్పిన హీరో

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×