E-Paper
Advertisement

Cherries: సూపర్ ఫ్రూట్.. క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకూ అన్నీ మటుమాయం!

Cherries: సూపర్ ఫ్రూట్.. క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకూ అన్నీ మటుమాయం!
Advertisement

Cherries: మన శరీర శ్రేయస్సుకు దోహదపడే పండ్లలో చెర్రీస్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. మన రోజూవారి డైట్‌లో గుప్పెడు చెర్రీ పండ్లను చేర్చుకుంటే.. క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకూ అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. చెర్రీస్‌లో పొటాషియంతో పాటు విటమిన్ సి కూడా ఉండటం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి. అనేక పోషకాలు కలిగి ఉన్న ఈ చెర్రీ పండ్లతో ప్రధానంగా ఐదు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

చెర్రీ పండ్లలో ఉండే అపారమైన యాంటిఆక్సిడెంట్ల వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు.. ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. చెర్రీస్‌లో ఉండే మెలటోనిన్ శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

Read Also: చిన్నా పెద్దా అందరూ తినొచ్చు.. పచ్చి బఠానీలు పలు వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం!

మెదడు చురుగ్గా పనిచేస్తుంది:

ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా.. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చెర్రీ పండ్లు అడ్డుకుంటాయి. ఇందులో ఉండే ఆంథోసయనిన్ అనే యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి.

నిద్రలేమి సమస్యకు చెక్:

Advertisement

చెర్రీ పండ్లలో ఉండే మెలటోనిన్ నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. రోజూ గుప్పెడు చెర్రీ పండ్లను తింటే చక్కగా నిద్రపోవచ్చు. అలాగే చెర్రీ పండ్లలో ఫైటోస్టెరాల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ పండ్లను తరచూ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. దీంతోపాటు రక్త నాళాలు కూడా గట్టిపడకుండా ఉంటాయి.

క్యాన్సర్‌‌కు అడ్డుకట్ట:

ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ చెర్రీ పండ్లు అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో క్యాన్సర్ మహమ్మారిని రాకుండా అడ్డుకునే యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే చెర్రీలోని పీచుపదార్థం జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య రాకుండా చూస్తుంది. ఈ పండ్లను నేరుగానే కాకుండా.. ఇతర పదార్థాలతో కలిపి కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

ఎముకలు దృఢంగా మారుతాయి:

కండరాల నొప్పితో బాధపడుతున్న వారు చెర్రీ పండ్లను రోజూ డైట్లో చేర్చుకుంటే.. ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే.. చెర్రీస్‌లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ గుణాలు కండరాలు, కీళ్ల నొప్పులను త్వరగా తగ్గిస్తాయి. ఈ పండ్లను రోజూ గుప్పెడు తింటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు చెర్రీస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గుణాలు అడ్డుకట్ట వేస్తాయి.

Read Also: చిన్న తీపి ముక్క చాలు.. చలికాలంలో వేధించే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×