E-Paper
Advertisement

Chiranjeevi vs Balakrishna: బాలకృష్ణ రికార్డును బ్రేక్ చేసిన చిరంజీవి.. ఒక్క రోజులోనే..!

Chiranjeevi vs Balakrishna: బాలకృష్ణ రికార్డును బ్రేక్ చేసిన చిరంజీవి.. ఒక్క రోజులోనే..!
Advertisement

Chiranjeevi vs Balakrishna: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. ప్రేక్షకుల ఆదరణతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో కలెక్షన్లు కూడా అంచనాలను మించుతున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో మంచి కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన అఖండ 2 రికార్డును చిరంజీవి బ్రేక్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘అఖండ 2’ ఉత్తర అమెరికాలో ఫైనల్‌గా సుమారు 1 మిలియన్ డాలర్లు..అంటే దాదాపు రూ.9 కోట్ల కలెక్షన్లు సాధించింది. అఖండ 2 చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అలానే బాలకృష్ణ నాలుగోసారి బోయపాటి శ్రీను తో చేసిన సినిమా కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు కొనసాగాయి. కానీ ఈ సినిమా నెగిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. అయినా కానీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి.

Advertisement

ఈ క్రమంలో చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు..మాత్రం ఇంకా పూర్తి స్థాయి రిలీజ్ కూడా కాకముందే, కేవలం ప్రీమియర్స్ ద్వారానే 1.2 మిలియన్ డాలర్లు..అంటే సుమారు రూ.11 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం అంటే మాటలు కాదు. దీంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. చిరంజీవి మార్కెట్ ఓవర్సీస్‌లో ఇంకా ఎంత బలంగా ఉందో ఈ రికార్డ్ మరోసారి నిరూపించింది.

ఈ సినిమా విజయంలో చిరంజీవి నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. కథ సింపుల్‌గా ఉన్నా, నవ్వులు, భావోద్వేగాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కడు కథ, కథనం పెద్దగా లేకపోయినా.. చిరంజీవి నటన మాత్రం ఒకప్పుడు లా ఉంది అంటూ ప్రశంసిస్తున్నారు.

Advertisement

సంక్రాంతి సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అదే ఓవర్సీస్‌లోనూ మంచి అడ్వాంటేజ్‌గా మారింది. ప్రీమియర్స్ నుంచే ఇంత భారీ కలెక్షన్లు రావడం, రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అనే ఆసక్తిని పెంచుతోంది.

మొత్తం పైన.. మన శంకర వర ప్రసాద్ గారు ఓవర్సీస్‌లో ‘అఖండ-2’ రికార్డును బ్రేక్ చేసి మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌ను మరోసారి చూపించింది. ఈ దూకుడు ఇలానే కొనసాగితే మరిన్ని రికార్డులు ఖాయం అని అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

ALSO READ: Nayanthara: నయనతార 100 కోట్ల ఇల్లు లోపల ఎలా ఉందో చూసారా?ఇంద్ర భవనాన్ని తలపిస్తుందిగా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×