E-Paper
Advertisement

Hyundai Staria Electric Car: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్లు.. హ్యుందాయ్ నుంచి క్రేజీ ఈవీ లాంచ్!

Hyundai Staria Electric Car: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్లు.. హ్యుందాయ్ నుంచి క్రేజీ ఈవీ లాంచ్!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెద్ద మొత్తంలో పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆటో మోబైల్ కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ తో పాటు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసే పనిలో పడ్డాయి. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఈవీలు మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. అందులో భాగంగానే హ్యుందాయ్ కంపెనీ కొత్త ఈవీని విడుదల చేసింది. బ్రస్సెల్స్ మోటార్ షోలో స్టారియా MPV కంప్లీట్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ ను ఆవిష్కరించింది. స్టారియా ఎలక్ట్రిక్ అని పిలువబడే ఇది హ్యుందాయ్ పెద్ద పీపుల్ మూవర్ ఫస్ట్ కంప్లీట్ ఎలక్ట్రిక్ కారుగా అందుబాటులోకి వచ్చింది. 2026 ఫస్టాఫ్ లో కొరియాతో పాటు యూరప్‌ లో ఈ కారు అమ్మకానికి రానుంది. ఆ తర్వాత ఇతర ప్రపంచ మార్కెట్లలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.

స్టారియా ఎలక్ట్రిక్ బ్యాటరీ, రేంజ్

స్టారియా ఎలక్ట్రిక్ కారు 160Kw(215bhp) పవర్, 350Nm టార్క్‌ ను  ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడిన 84kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ ను తీసుకుంటుంది. ఈ కారు ఒక పూర్తి ఛార్జ్ మీద 400km వరకు రేంజ్ అను అందిస్తుంది. MPV 800 వోల్ట్ ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుంది. ఇది సరైన 20 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్ ను పొందుతుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. 11kW AC ఆన్‌ బోర్డ్ ఛార్జర్ కూడా అందించబడుతుంది.

స్టారియా ఎలక్ట్రిక్ డిజైన్

Advertisement

లే అవుట్ పరంగా, స్టారియా ఎలక్ట్రిక్ ICE-ఆధారిత మోడల్ మాదిరిగానే పొడవైన, బాక్సీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఇంటర్నల్ స్పేస్, యాక్సెస్ సౌలభ్యానికి మంచి ప్రయారిటీ ఇస్తుంది.  హ్యుందాయ్ ఎలక్ట్రిక్ MPVని రెండు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుంది. ఏడు సీట్ల లగ్జరీ వేరియంట్, తొమ్మిది సీట్ల వ్యాగన్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. కాన్ఫిగరేషన్‌పై ఆధారపడి, లగేజ్ సామర్థ్యం 435 లీటర్ల నుంచి 1,303 లీటర్ల వరకు ఉంటుంది.

ICE స్టారియాపై డిజైన్ మార్పులలో క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ ఫాసియా, EV నిర్దిష్ట వివరాలు, LED లైటింగ్ సిగ్నేచర్ ఉన్నాయి. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఈజీ యాక్సెస్ కోసం ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఉంటుంది. లోపల, MPV హెడ్‌ రూమ్, సీట్ల వరుసల మధ్య కదలికను పెంచేలా ఫ్లాట్ ఫ్లోర్ లే అవుట్, హై రూఫ్‌ లైన్‌ను కలిగి ఉంది. డాష్‌బోర్డ్‌ లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్ సామర్థ్యంతో హ్యుందాయ్ తాజా ccNC సాఫ్ట్‌ వేర్‌ ను ఉపయోగిస్తోంది. తరచుగా ఉపయోగించే ఫంక్షన్ల కోసం ఫిజికల్ బటన్లు అలాగే ఉన్నాయి.

ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?

Advertisement

హ్యుందాయ్ యూరోపియన్, కొరియన్ మార్కెట్ల కోసం ఈ కారును లాంచ్ చేసినప్పటికీ, భారత్ లో లాంచ్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పెద్ద MPVల పరిమిత స్వీకరణ, EV ఛార్జింగ్  మౌలిక సదుపాయాల పరిమితుల దృష్ట్యా, భారత మార్కెట్‌ లోకి ఇప్పట్లో రావడం కష్టం అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also:  రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 లాంచ్, ధర ఎంతో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×