E-Paper
Advertisement

Chinmayi Sripada: AI కాదు దాన్నే వాడే మనుషులే దుర్మార్గులు.. మరోసారి చిన్మయి వాగ్వాదం..!

Chinmayi Sripada: AI కాదు దాన్నే వాడే మనుషులే దుర్మార్గులు.. మరోసారి చిన్మయి వాగ్వాదం..!
Advertisement

Chinmayi Sripada: సోషల్ మీడియాలో అమ్మాయిల గురించి చిన్న మాట అన్నా సరే గట్టిగా స్పందించే వాళ్లలో అనసూయ.. చిన్మయి శ్రీపాద.. ముందువరుసలో ఉంటారని చాలామందికి తెలుసు. చిన్న చిన్న విషయాలకే కూడా వీళ్లు పెద్దగా.. రియాక్ట్ అవుతుంటారు. ఇదే క్రమంలో ఈమధ్య.. నటుడు శివాజీ విషయంలో కూడా చిన్మయి గట్టిగా స్పందించి పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరోసారి చిన్మయి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా చిన్మయి “AI is fine. The users are dangerous” అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ప్రమాదం కాదని..దాన్ని వాడే మనుషుల ఆలోచనలే అసలు ప్రమాదమని ఆమె అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన ఓ యూజర్ “ఇప్పటి కాలంలో AI మరింత డేంజరస్ అవుతోంది” అంటూ కామెంట్ చేయగా..దానికి చిన్మయి తిరిగి తన మాటను స్పష్టంగా చెప్పింది. టెక్నాలజీ కంటే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలు సమస్య అనేది తన ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

అయితే ఈ పోస్ట్ కింద వచ్చిన కొన్ని కామెంట్లు మరో వివాదానికి కారణమయ్యాయి. “అందరూ యూజర్లు డేంజరస్ కాదు.. కొందరే” అంటూ ఓ అకౌంట్ కామెంట్ చేయడంతో చిన్మయి కాస్త ఘాటుగా స్పందించారు. “నేను ఎక్కడా అందరూ అని చెప్పానా?” అంటూ ప్రశ్నించారు. ఈ ఒక్క రిప్లైతోనే నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. కొందరు చిన్మయి మాటల్లో నిజం ఉందని మద్దతు తెలుపుతుంటే..మరికొందరు మాత్రం చిన్మయి ఎందుకు ప్రతి విషయాన్ని విధంగా వాదిస్తుందో అని కామెంట్లు పెడుతున్నారు.

చిన్మయి గతంలో కూడా ఎంతోమంది అబ్బాయిల విషయంలో కొంచెం ఘాతగానే స్పందించారు. అమ్మాయిలు ఎప్పుడూ గొప్ప.. అనే ఉద్దేశంతోనే మాట్లాడే చిన్మయికి అలానే సోషల్ మీడియాలోని అబ్బాయిలకు తరచూ వాదన జరుగుతూనే ఉంటుంది. ఇక సెలబ్రిటీల విషయంలో కూడా.. వాళ్లు అమ్మాయిలను ఏమన్నా అంటే చిన్మయి వెంటనే ఏదో ఒక పోస్ట్ పెడుతుంది. అలానే శివాజీ వ్యాఖ్యల వివాదంలోనూ.. ఆమె ఎలాంటి భయం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అందుకే ఆమె చేసే ప్రతి పోస్ట్, ప్రతి రిప్లై పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఈ తాజా AI వ్యాఖ్యల వ్యవహారం కూడా అదే కోవలోకి చేరింది.

Advertisement

మొత్తానికి చూస్తే.. చిన్మయి పెట్టిన ఈ పోస్ట్.. టెక్నాలజీ కన్నా మనుషుల ప్రవర్తనే అసలు సమస్య అనే విషయాన్ని మరోసారి తెలపకనే తెలిపింది.

ఇక చిన్మయి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమె హీరో అలానే దర్శకుడు అయినా రాహుల్ రవీంద్రన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే రష్మిక హీరోయిన్గా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఈ సినిమా కూడా.. అమ్మాయిల ఫ్రీడంకి సంబంధించిన సినిమానే కావడం గమనర్హం.

ALSO READ: Chinmayi Sripada: చీర కట్టుకున్న అమ్మాయి పరిస్థితి ఇదే.. ఆ వీడియో పెట్టి మరీ చిన్మయి చిందులు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×