E-Paper
Advertisement

అఖిల్ లెనిన్ మూవీకి సెన్సార్ షాక్.. నిర్మాతలు ఏం చేస్తున్నారంటే?

అఖిల్ లెనిన్ మూవీకి సెన్సార్ షాక్.. నిర్మాతలు ఏం చేస్తున్నారంటే?
Advertisement

Lenin movie censor: మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన చిత్రం లెనిన్. జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మునుపేన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం గట్టిగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు అఖిల్. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ పై అంచనాలు పెంచేస్తూ.. చేస్తున్న ప్రచారాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో సెన్సార్ బోర్డు లెనిన్ మూవీకి భారీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సమయంలో నిర్మాతలు చేస్తున్న పనులు కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

లెనిన్ మూవీకి సెన్సార్ షాక్..

ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార వీడియోలు, ట్రైలర్ చూస్తుంటే సినిమా కాస్త వైలెంట్ గా ఉన్నట్లు అనిపిస్తోందని.. సెన్సార్ బోర్డ్ కి ఈ మూవీ వెళ్ళగా ఇది చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే మేకర్స్ మాత్రం U/A సర్టిఫికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి A సర్టిఫికెట్ జారీ చేస్తే కేవలం అడల్ట్ మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రాకపోతే.. ఈ ప్రభావం సినిమా కలెక్షన్ల పై పడుతుంది. అందుకే ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు యూ/ఏ సర్టిఫికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తుందో తెలియాలి అంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

also read:సోదరి అన్షు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వీ వాచ్.. ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!

వైరల్ గా మారిన లెనిన్ స్టోరీ..

మరొకవైపు రేపు థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి ఎలాంటి ప్రీమియర్ షోలు వేయకపోవడం కూడా అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇకపోతే జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ ప్రివ్యూ షో ని రామానాయుడు స్టూడియోలో మూవీ టీం వీక్షించింది. ఈ షోకు కొంతమంది మీడియా ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వారి నుంచి ఫీడ్ బ్యాక్ రాగా.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇక లెనిన్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ట్రైలర్ లో చూపించినట్టు చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామంలో కథ మొదలవుతుంది. గ్రామీణ నేపథ్యం, అఖిల్ లుక్స్, నేచురల్ యాక్టింగ్ ఆకట్టుకుంటున్నాయట. చిత్తూరు స్లాంగ్ లో అఖిల్ అద్భుతంగా నటించినట్లు సమాచారం . ఫస్ట్ ఆఫ్ లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ , ఎమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలిచాయట. పైగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉందని , సినిమా చూసిన మీడియా మిత్రులు చెబుతున్నారు. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ లో ఉంటుందని, ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు మతి పోగొడతాయని సమాచారం. అఖిల్ కెరియర్ లో మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుందని కూడా చెబుతున్నారు. మరి ఫుల్ రివ్యూ రావాలి అంటే జూలై 10 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ రష్మి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!

2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

రూ.100 కోట్ల ఆస్తి.. ఊహించని స్టార్డం.. అయినా నోకియా ఫోన్ వాడుతున్న పోసాని.. అసలు కథేంటంటే?

విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో మార్పులు.. ఆ సీన్స్ అన్నీ కట్!

Big Stories

Advertisement
×