E-Paper
Advertisement

Yash Toxic: వివాదంలో టాక్సిక్ టీజర్.. సెన్సార్ బోర్డు స్పందన ఇదే!

Yash Toxic: వివాదంలో టాక్సిక్ టీజర్.. సెన్సార్ బోర్డు స్పందన ఇదే!
Advertisement

Yash Toxic: పాన్ ఇండియా స్టార్ హీరో యష్ (Yash)నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్(Toxic). కేజి ఎఫ్ 2 తరువాత ఎస్ నటిస్తున్న ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈయన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. అయితే కొంతమంది ఈ టీజర్ పై విమర్శలు కూడా కురిపించారు. ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్న నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు మహిళా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వెంటనే ఈ టీజర్ తొలగించాలి అంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదులు చేశారు.

టాక్సిక్ టీజర్ తో మాకు సంబంధం లేదు..

టాక్సిక్ సినిమా టీజర్ గురించి కర్ణాటక మహిళా కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లడంతో మహిళా కమిషన్ ఈ టీజర్ లో ఉన్న అభ్యంతర దృశ్యాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెన్సార్ ఫిలిం బోర్డుకు లేఖ రాశారు. ఈ విషయంపై స్పందించిన సెన్సార్ బోర్డు వారి అభిప్రాయాలను తెలియచేశారు. మహిళా కమిషన్ రాసిన లేఖకు స్పందిస్తూ.. థియేటర్లో కాకుండా యూట్యూబ్ లో విడుదలైన టీజర్ మా పరిధిలోకి రావని తెలిపారు. కేవలం థియేటర్లలో విడుదలయ్యే టీజర్ లేదా ట్రైలర్ కు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ తప్పనిసరి అవసరమని, యూట్యూబ్లో విడుదల అయిన వాటికి, సెన్సార్ బోర్డు కు సంబంధంలేదని తెలియజేశారు.

సెన్సార్ బోర్డు నుంచి ఉపశమనం..

Advertisement

ఇక టాక్సిక్ చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి కంటెంట్ సర్టిఫికేషన్ కోసం తమ వద్దకు రాలేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇలా సెన్సార్ బోర్డు ఈ వివాదం పై స్పందిస్తూ మాకు సంబంధం లేదనే విషయాన్ని తెలియచేయడంతో చిత్ర బృందానికి కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. సెన్సార్ బోర్డ్ ఈ వివాదం పై స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వివాదంపై మహిళా కమిషన్, రాజకీయ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది .

గీతు మోహన్ దాస్ పై విమర్శలు…

Advertisement

ఇక ఈ సినిమాకు మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె పట్ల కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి టీజర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంతో తదుపరి ఈ సినిమా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతోంది అంటూ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాని మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు . ఇక ఈ సినిమాలో కియార అద్వానీతో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Maruthi -Chiranjeevi: మారుతి డైరెక్షన్ లో చిరు… మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×