E-Paper
Advertisement

Late Sleep Effects: డైట్ ఫాలో అవుతున్నా బరువు తగ్గడం లేదా? రాత్రి 11 తర్వాత పడుకోవడమే కారణమంటున్న నిపుణులు!

Late Sleep Effects: డైట్ ఫాలో అవుతున్నా బరువు తగ్గడం లేదా? రాత్రి 11 తర్వాత పడుకోవడమే కారణమంటున్న నిపుణులు!
Advertisement

Late Sleep Effects: చాలామంది బలంగా నమ్మే సిద్ధాంతం ఏమిటంటే.. బరువు తగ్గాలంటే డైట్, వ్యాయామం, వాకింగ్ చేస్తే చాలు అనుకుంటారు. అయితే వీటి అన్నిటితో పాటు నాణ్యమైన నిద్రకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి 11 దాటిన తర్వాత నిద్రపోయే వారిలో, క్లీన్ డైట్ ఫాలో అవుతున్నా కూడా బరువు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

అంతేకాదు.. రాత్రి 11 తర్వాత నిద్రపోయే అలవాటు మీరు ప్రతిరోజూ అలవాటు చేసుకున్నట్లయితే.. బరువు తగ్గకపోవడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారని చెబుతున్నారు నిపుణులు. నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి కోసం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం, శక్తి స్థాయి, రోగనిరోధక శక్తికి కూడా నేరుగా సంబంధించినది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీ జీవ గడియారం డిస్ట్రబ్ అవుతుంది. దాంతో గాఢమైన, ప్రశాంతమైన నిద్రను పొందడం కష్టమవుతుంది. ఫలితంగా ఉదయం నిద్ర లేచినప్పుడు అలసట, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు చుట్టుముడతాయి.

Advertisement

Also Read: నోటి పుండ్లు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి? హార్మోన్లు, ఒత్తిడి, పోషకాహార లోపమే కారణమా?

మన శరీరం ఒక నిర్దిష్ట బయోలాజికల్ క్లాక్‌ను అనుసరిస్తుంది. రాత్రి 10:30 నుంచి జీర్ణక్రియ నెమ్మదించటం మొదలవుతుంది. ఆ సమయంలో కూడా మేలుకుని ఉంటే, శరీరం ఒత్తిడికి లోనవుతుంది. అప్పుడు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఇది రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటే కొవ్వు కరిగే ప్రక్రియ ఆగిపోయి, నిల్వ ఉండే అవకాశం పెరుగుతుంది. దీంతో మీరెంత క్లీన్ డైట్ ఫాలో అయినా కూడా బరువు తగ్గరు.

Advertisement

రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య శరీరంలో అత్యంత సమర్థవంతమైన రిపేర్, మెటబాలిక్ రీసెట్ జరుగుతుంది. ఈ సమయంలో నిద్ర లేకపోతే మెటబాలిజం దెబ్బ తింటుంది. దాంతో బ్లడ్ షుగర్ నియంత్రణ కోల్పోతుంది. ఇక ఆకలి హార్మోన్లు ఏం చేస్తాయంటే.. మరుసటి రోజు ఎక్కువగా తినమని ప్రేరేపిస్తాయి. తీపి లేదా కార్బోహైడ్రేట్స్‌పై కోరికలు పెరగడం జరుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో జాప్యం జరగవచ్చు.

సరైన నిద్ర లేకపోతే శరీర డిటాక్స్ ప్రక్రియ కూడా ప్రభావితం అవుతుంది. ఉదయం లేవగానే పొట్ట బరువుగా అనిపించడం, ఎక్కువ నీరు నిల్వ ఉండటం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాదు.. రాత్రి 11 తర్వాత పడుకునే వాళ్లు మధుమేహం, చక్కెర స్థాయులు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మంచి శరీరాకృతిని పొందడానికి మీరెన్ని వ్యాయామాలు చేసినా.. శరీరానికి కావాల్సిన విశ్రాంతిని అందించకపోతే ఎలాంటి ఫలితాన్ని పొందలేరు.  మీ నిద్ర సమయాన్ని ఒక్కసారిగా మార్చుకోవడం కష్టమే అయినప్పటికీ.. కాస్త నిదానంగా స్లీపింగ్ టైమింగ్‌ను మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు. అలాగే రాత్రి నిద్రకు కనీసం మూడు గంటల ముందే భోజనం పూర్తిచేయాలి. దీంతోపాటు స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం మానేయడం వంటి నియమాలు పాటిస్తేనే, మీరు అనుకున్న సమయాన్ని బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోగలరు.

Also Read: కివీ పండు తొక్కలో ఇంత ఆరోగ్యం దాగుందా? వామ్మో.. ఈ విషయం తెలియక ఇన్నిరోజులూ పడేశాం కదరా!

 

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×