E-Paper
Advertisement

డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్లీ దొరికిన స్టార్ సింగర్!

డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్లీ దొరికిన స్టార్ సింగర్!
Advertisement

Film industry: సెలబ్రిటీలు అభిమానులకు , సినీ ప్రేక్షకులకు, సామాన్యులకు ఆదర్శంగా నిలవాలి . కానీ వారు చేసే పనుల వల్ల వారిపై అభిమానులలో గౌరవం కూడా తగ్గిపోతుంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం.. అంటూ ప్రభుత్వాలు ఎన్నిసార్లు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా..ఎవరు పట్టించుకోవడం లేదు. వేస్తే బహుశా జరిమానా.. లేదా ఒకరోజు లేదా మూడు నెలలు జైలు జీవితం అంతేగా అనేట్టుగా కొంతమంది ప్రవర్తన అందరిని ఆశ్చర్యపరిస్తోంది..ఈ క్రమంలోనే గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి అందరిని ఆశ్చర్యపరిచిన ఒక స్టార్ సింగర్ ఇప్పుడు మళ్లీ ఇదే కేసులో చిక్కుకోవడంతో అభిమానులు కూడా ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన స్టార్ సింగర్..

ఆమె ఎవరో కాదు పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్.. గతంలో పలుమార్లు ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన ఈమె.. మరొకసారి పోలీసుల కంట పడింది. తాజాగా ఈమె మద్యం సేవించి వాహనం నడుపుతుండగా.. సౌత్ కాలిఫోర్నియా పోలీసులు ఈమెను పట్టుకున్నారు. ఇక అనంతరం వెంటురా కౌంటీ సుపీరియర్ కోర్టులో హాజరు పరిచారు. ఇకపోతే విచారణ జరిపిన తర్వాత న్యాయ మూర్తి ఈమెకు ఒకరోజు జైలు జీవితంతో పాటు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చారు . అలాగే మూడు నెలలు స్టేట్ డ్రైవింగ్ అవగాహన శిబిరాలకు, వారానికి ఒకసారి థెరపీ సెషన్లకు హాజరవ్వాలని సూచించారు. అంతేకాదు నెలకు రెండు సార్లు మానసిక వైద్యుడిని కూడా కలవాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక ప్రస్తుతం బ్రిట్నీ స్పియర్స్ కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

also read:పవన్ కళ్యాణ్ , విజయ్ గెలుపుపై ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్!

బ్రిట్నీ స్పియర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం ఇదేం తొలిసారి కాదు..

ఇకపోతే ఈ పాప్ సింగర్ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం ఇదేమి తొలిసారి కాదు.. ఈ ఏడాది మార్చిలో కూడా ఈమె మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే ఈమె ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రమే కాదు చట్టపరమైన చిక్కులను కూడా ఈమె ఎదుర్కొంది. 2007లో లాస్ ఏంజిల్స్ లో పార్క్ చేసిన ఒక కారును ఢీ కొట్టి అక్కడినుండి పారిపోయింది. ఆ తర్వాత నాలుగు సార్లు దుష్ప్రవర్తన ఆరోపణలు కూడా ఎదుర్కొంది. వాహన యజమానికి నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇలా ఏదో ఒక విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కోవడంతో నేటిజన్లు ఈమెపై మండిపడుతున్నారు. పోలీసులు నిఘా వేయాలి అని కామెంట్ చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×