E-Paper
Advertisement

నయనతార నటన పై కరీనా కపూర్ కామెంట్స్…ఇలా అనేసిందేంటీ?

నయనతార నటన పై కరీనా కపూర్ కామెంట్స్…ఇలా అనేసిందేంటీ?
Advertisement

Kareena Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న వారిలో కరీనాకపూర్ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకున్న కరీనాకపూర్ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇలా అడపాదడపా సినిమాలలో కొనసాగుతున్న  కరీనాకపూర్ తాజాగా నటి నయనతార గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. నయనతార సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నారు.

నయన్ నటన పై కరీనా కామెంట్స్… 

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ఈమె ఇటీవల బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతున్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న నయనతార గురించి కరీనాకపూర్ మాట్లాడుతూ.. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలలో నయనతార ఒకరు. ఆమె నటన చాలా సహజంగా ఉంటుందని, ఒక మాటలో చెప్పాలి అంటే నయనతార ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ అంటూ నయనతార గురించి ఆమె నటన గురించి ప్రశంసలు కురిపించారు.

ఇండియాస్ బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్..

Advertisement

ఇలా ఇండియాలోనే నయనతార బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ అంటూ ఈమె నయన్ పై ప్రశంసలు కురిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు సౌత్ హీరోయిన్స్ గురించి ఇంత గొప్పగా మాట్లాడరు కానీ కరీనాకపూర్ ఇలాంటి కామెంట్ చేయడంతో ఇలా మాట్లాడింది ఏంటి అంటూ అభిమానులు కూడా కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నయనతార గురించి కరీనాకపూర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో నయనతారకు మరింత క్రేజ్ పెరిగిపోయిందని చెప్పాలి.

సల్మాన్ ఖాన్ జోడిగా నయన్..

Advertisement

నయనతార షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నయన్ ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు నయనతార పాన్ ఇండియా సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటించిన టాక్సిక్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Also Read: జైలు జీవితం పై సంజనా ఎమోషనల్… బలి పశువును చేశారంటూ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×