E-Paper
Advertisement

APFDC చైర్మన్‌గా భరత్ భూషణ్..అభినందించిన నటసింహం !

APFDC చైర్మన్‌గా భరత్ భూషణ్..అభినందించిన నటసింహం !
Advertisement

Bharat Bhushan : ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన భరత్ భూషణ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఇక ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ ఈ నిర్ణయం పట్ల తమ సంతోషాన్ని తెలిపింది కూడా.

అభినందించిన నందమూరి బాలకృష్ణ

Advertisement

ఇక ఈ నియామకం జరిగిన వెంటనే భరత్ భూషణ్ పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణగారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గారు ఆయనకు అభినందనలు తెలుపుతూ,ఏపీలో సినీ, టీవీ మరియు నాటక రంగాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. “అందరినీ కలుపుకుంటూ పరిశ్రమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేయాలి” అని బాలయ్య ఆయనకు దిశానిర్దేశం చేశారు.

also read :అప్పుడు ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ‘కల్కి 2’.. అదే తప్పు మళ్ళీ జరుగుతుందా?

Advertisement

దాదాపు 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో

భరత్ భూషణ్ విషయానికి వస్తే..సినిమాలపై ఉన్న ఇష్టంతో దాదాపు 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొనసాగుతూ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను ఆడియన్స్ కి అందించారు.ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సమయంలో, అటు ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచారు.ముఖ్యంగా భరత్ భూషణ్ గారికి ఉన్న అతిపెద్ద బలం రాజకీయ మరియు సినీ వర్గాలతో ఉన్న సత్సంబంధాలు. గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు,సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న జీఎస్టీ సమస్యలు, వర్చువల్ ప్రింట్ ఫీజు (VPF) వివాదాలు మరియు టికెట్ ధరల వంటి సెన్సిటివ్ అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపి, నిర్మాతల ప్రయోజనాలను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు కూడా.

భరత్ ఇన్‌ఫ్రా’ సంస్థ ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు

జాతీయ స్థాయిలో ఆయన సేవలను గుర్తించిన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఆయనను వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం ఒక విశేషమైతే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని ఏపీ fdc చైర్మన్‌గా నియమించడం మరో విశేషం.మరో వైపు ‘భరత్ ఇన్‌ఫ్రా’ సంస్థ ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు కలిపించి సక్సెస్ ఫుల్ ఇండస్ట్రీయలిస్టు గా పేరు తెచ్చుకున్నారు.

ఇకపోతే ..ఇప్పటికే మిగతా రాష్ట్రాలకి దీటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా మరియు నాటక రంగాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో భరత్ భూషణ్ వంటి అనుభవజ్ఞుడిని చైర్మన్‌గా నియమించడం అంటే రాష్ట్రంలో షూటింగ్‌లు, మౌలిక సదుపాయాలు మరియు నాటక కళాకారుల సంక్షేమానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబోతుందో అర్థమవుతోంది.

also read :చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్.. నవ్వుల గ్యారెంటీ! గ్రాండ్‌గా మొదలైన కొత్త చిత్రం!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×