E-Paper
Advertisement

సంపాదన పెరుగుతున్నా సేవింగ్స్ పెరగడం లేదా? 90% మంది చేసే ఆ ఒక్క తప్పు ఇదే!

సంపాదన పెరుగుతున్నా సేవింగ్స్ పెరగడం లేదా? 90% మంది చేసే ఆ ఒక్క తప్పు ఇదే!
Advertisement

Personal Finance Management: జీతం పెరిగినప్పుడు మనలో చాలా మంది చేసే.. మొదటి పని ఖర్చులను పెంచడం.కొత్త ఫోన్, ఖరీదైన బట్టలు లేదా ఇతర పనులకు వాడటం. ఇలా ఆదాయంతో పాటు అవసరాలు కూడా పెరిగిపోతుంటాయి.దీనినే ‘లైఫ్‌స్టైల్ క్రీప్’ అంటారు.ఆదాయం పెరుగుతున్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగకపోవడానికి 90 శాతం మంది చేసే ప్రధాన పొరపాటు ఇదే. సంపాదన పెరగడం ఎంత ముఖ్యమూ.. పెరిగిన సంపాదనను సరైన పద్ధతిలో వాడటం కూడా అంతకంటే.. ముఖ్యం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సంపాదన పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరగదు?

Advertisement

మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే.. ఎంత పొదుపు చేస్తున్నాం అనేది మన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. ఆదాయం పెరిగిన ప్రతిసారీ మన బ్యాంక్ ఖాతా మెరుగు పడకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. ఆసక్తికరమైన నిజాలు బయట పడతాయి.

1. లైఫ్‌స్టైల్ క్రీప్:
90 శాతం మంది చేసే అతి పెద్ద పొరపాటు ఇది. జీతం పెరగగానే, అప్పటివరకు ఉన్న సాధారణ జీవనశైలిని విడిచిపెట్టి, ఖరీదైన వస్తువుల వైపు మొగ్గు చూపుతాము. ఉదాహరణకు.. సాధారణ ఫోన్ వాడే వ్యక్తి జీతం పెరగగానే లోన్ పెట్టి ఐఫోన్ కొనడం. దీనివల్ల ఆదాయం పెరిగినా.. ఆ పెరుగుదల మొత్తం విలాసాలకే సరి పోతుంది. ఫలితంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది.

Advertisement

2. పార్కిన్సన్స్ లా :
ఆర్థిక విషయాల్లో ఒక నియమం ఉంది. “ఖర్చులు ఎప్పుడూ ఆదాయానికి సమానంగా పెరుగుతాయి.” మన దగ్గర ఎంత డబ్బు ఉంటే.. అంత ఖర్చు చేయడానికి మన మెదడు మార్గాలను వెతుకుతుంది. దీన్ని నియంత్రించకపోతే.. నెలకు లక్ష రూపాయలు సంపాదించినా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు.

3. అప్పుల ఊబి:
చాలా మంది ఆదాయం పెరగగానే.. పెద్ద ఇల్లు లేదా కొత్త కారు కొనేందుకు భారీ లోన్లు తీసుకుంటారు. పెరిగిన జీతం అంతా ఈ ఇఎంఐ (EMI) లకే సరి పోతుంది. ఇది మీ ఆస్తులను పెంచుతున్నట్లు అనిపించినా.. లిక్విడ్ క్యాష్ ను మాత్రం పెంచదు. దీని వల్ల అత్యవసర సమయాల్లో మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది.

4. పన్నుల ప్రభావం:
ఆదాయం పెరిగినప్పుడు మీరు పన్ను పరిధిలోకి మారే అవకాశం ఉంది. టాక్స్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే.. పెరిగిన ఆదాయంలో సగం పన్నుల రూపంలోనే.. పోతుంది. దీని వల్ల చేతికి వచ్చే నికర ఆదాయం ఆశించినంతగా ఉండదు.

Also Read: మనీ మేనేజ్‌మెంట్..పెళ్లైన మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్థిక విషయాలివే!

ఈ సమస్యను అధిగమించడం ఎలా?

పే యువర్ సెల్ఫ్ ఫస్ట్: జీతం పెరిగిన వెంటనే.. ఆ పెరిగిన మొత్తంలో కనీసం 50 శాతం నేరుగా ఇన్వెస్ట్‌మెంట్లకు (SIP లేదా PPF) మళ్ళించేలా ఆటోమేట్ చేయండి. డబ్బు చేతికి అందితేనే కదా ఖర్చయ్యేది.

బడ్జెట్ నియమం: మీ ఆదాయం పెరిగినా.. కనీసం ఆరు నెలల పాటు పాత బడ్జెట్‌నే అనుసరించండి. దీని వల్ల ఆ ఆరు నెలల అదనపు ఆదాయం మీ ఎమర్జెన్సీ ఫండ్‌ను నిర్మిస్తుంది.

అవసరానికి,కోరికకు తేడా గుర్తించండి: ఏదైనా వస్తువు కొనే ముందు “ఇది నాకు అవసరమా లేక కేవలం కోరికనా?” అని ప్రశ్నించుకోండి.

ధనవంతులు కావడం అంటే కేవలం ఎక్కువ సంపాదించడం కాదు. ఉన్న డబ్బును తెలివిగా వాడటం. ఆదాయం పెరిగినప్పుడు.. మీ జీవన ప్రమాణాలను పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ అది మీ ఆర్థిక భద్రతను పణంగా పెట్టి చేయకూడదు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×