E-Paper
Advertisement

ఎరుపెక్కిన బుగ్గలు.. అతడినే పెళ్లి చేసుకుంటానంటున్న భాగ్యశ్రీ.. వీడియో వైరల్!

ఎరుపెక్కిన బుగ్గలు.. అతడినే పెళ్లి చేసుకుంటానంటున్న భాగ్యశ్రీ.. వీడియో వైరల్!
Advertisement

Bhagyashri Borse: యారియాన్ 2 చిత్రంతో వెండితెర ప్రేక్షకులను పలకరించిన భాగ్యశ్రీ బోర్..సే తొలిసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పైగా ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్ డమ్’ చిత్రంలో కూడా హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చివరిగా మహేష్ బాబు పచ్చిగొల్ల రచనా, దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పెళ్లిపై భాగ్యశ్రీ కామెంట్స్..

ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ‘లెనిన్’ సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో భారతి పాత్రతో అద్భుతమైన నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే కెరియర్ పరంగా సరైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్న భాగ్యశ్రీ.. మరొకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన పెళ్లి గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ప్రేమలో ఉంది అనే రూమర్లు వినిపిస్తున్న వేళ.. సడన్గా పెళ్లిపై కామెంట్లు చేసి ఆ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది.

ఫ్రెండ్ గా అతడే..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తరచుగా సెలబ్రిటీ టాక్ షోలలో అడిగే ర్యాపిడ్ ఫైర్ ప్రశ్న “ఫ్రెండ్ , మ్యారీ, డేట్?” అనే టాస్క్ ఇచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలలో ఎవరితో స్నేహం చేస్తారు? ఎవరితో డేటింగ్ కి వెళ్తారు ? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని ప్రశ్నించగా సరదాగా సమాధానం ఇచ్చింది భాగ్యశ్రీ . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లెనిన్ హీరో అక్కినేని అఖిల్ గురించి మాట్లాడుతూ..” అఖిల్ చాలా మంచి వ్యక్తి. సెట్స్ లో ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. అందుకే ఆయనను ఫ్రెండ్ గా ఎంచుకుంటున్నాను” అంటూ తెలిపింది.

also read:మాజీ అత్తింటిపై వీడని మమకారం..కష్టాల్లో ఉన్న మరిదికి సమంత తోడైతే?

నేను పెళ్లి చేసుకోబోయేది అతడినే – భాగ్య శ్రీ

Advertisement

ఇక ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. దానికి ఆమె మాట్లాడుతూ..” నేను నటించిన కో-స్టార్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకే ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మిగిలి ఉన్నారు.. ఆయనే “అంటూ నవ్వుతూ ఎరుపెక్కిన బుగ్గలతో సమాధానం ఇచ్చింది. ఇక ఆయన పేరు భాగ్యశ్రీ చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమె రామ్ పోతినేని ఉద్దేశించే ఈ కామెంట్లు చేశారని అటు పలువురు నెటిజన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

రూమర్స్ మొదలైంది అక్కడే..

ఇకపోతే ఈ రూమర్స్ మొదలవడానికి కారణం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే కామెంట్లు వ్యక్తమయ్యాయి. అటు ఈ జంట ఈ రూమర్స్ పై స్పందించలేదు. ఇక ఇప్పుడు లెనిన్ మూవీ ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ ఇలా కామెంట్లు చేయడంతో ఇక త్వరలో టాలీవుడ్ లో పీ పీ.. డుం డుం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×