E-Paper
Advertisement

వర్షాకాలంలో టీ మంచిదా? కాఫీనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వర్షాకాలంలో టీ మంచిదా? కాఫీనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Advertisement

Tea vs Coffee in Monsoon: బయట చల్లని గాలి..చిటపట చినుకులు పడుతుంటే.. చేతిలో వేడివేడి కప్పు పట్టుకుని కూర్చోవడమే ఒక పెద్ద కిక్! అయితే.. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరి మైండ్‌లో మెదిలే ప్రశ్న ఒకటి ఉంటుంది.. అదే “టీ తాగాలా? కాఫీ తాగాలా? ఏది మన ఆరోగ్యానికి మంచిది?”. వానాకాలంలో వాతావరణం మారడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ తగ్గి, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ టైంలో మీ హెల్త్‌ను కాపాడుతూ, ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే బెస్ట్ డ్రింక్ ఏంటో సైన్స్ ప్రకారం ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో టీ ప్రయోజనాలు:

చాలా మందికి టీ అంటే కేవలం ఒక డ్రింక్ కాదు, అదొక ఎమోషన్! ముఖ్యంగా వర్షాకాలంలో టీ తాగడం వల్ల శరీరానికి బోలెడన్ని లాభాలున్నాయి.

Advertisement

ఇమ్యూనిటీ బూస్టర్: మనం టీ చేసుకునేటప్పుడు అందులో అల్లం, తులసి, యాలకులు, లేదా దాల్చినచెక్క వంటి మసాలాలు జోడిస్తాం. వీటిల్లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వర్షాకాలంలో.. వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.

తక్కువ కెఫిన్: కాఫీతో పోలిస్తే.. టీలో కెఫిన్ శాతం చాలా తక్కువ. ఇందులో ఉండే ‘ఎల్-థియానిన్’అనే అమినో యాసిడ్ బ్రెయిన్‌ను ప్రశాంతంగా ఉంచుతూనే.. మనల్ని అలర్ట్‌గా ఉంచుతుంది.

Advertisement

జీర్ణక్రియకు మేలు: వానాకాలంలో జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట ఉబ్బరం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

వర్షంలో కాఫీ:
కాఫీ లవర్స్‌కు వర్షం పడుతుంటే.. స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ తాగడం చాలా ఇష్టం.

ఇన్‌స్టంట్ ఎనర్జీ: కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల, అది తాగిన వెంటనే బాడీకి రాకెట్ స్పీడ్‌తో ఎనర్జీ వస్తుంది. వానాకాలం మబ్బుల వల్ల వచ్చే బద్ధకాన్ని వదిలించుకోవడానికి కాఫీ బెస్ట్ ఆప్షన్.

యాంటీఆక్సిడెంట్స్: కాఫీ గింజల్లో కూడా మంచి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెటబాలిజం పెంచడానికి సహాయపడతాయి.

రెండింటిలో ఏది బెస్ట్?
వర్షాకాలంలో కాఫీ కంటే ‘టీ’ (ముఖ్యంగా మసాలా టీ లేదా హెర్బల్ టీ) ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది.

దీనికి కారణం కాఫీ ఎక్కువగా తాగితే అందులోని హై కెఫిన్ వల్ల ఎసిడిటీ లేదా డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. అదే టీ అయితే.. అందులోని ఆయుర్వేద మూలికలు వానాకాలం ఇన్ఫెక్షన్ల పై పోరాడే యాంటీ-బాక్టీరియల్ కవచంలాచేస్తాయి.

మీరు కాఫీ ప్రియులైనా, టీ ప్రియులైనా సరే.. వర్షాకాలంలో వేడివేడిగా ఎంజాయ్ చేయండి. కానీ రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకుండా చూసుకోండి. వీలైతే పంచదారకు బదులు బెల్లం లేదా తేనె వాడి మీ డ్రింక్‌ను మరింత హెల్తీగా మార్చుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×