E-Paper
Advertisement

Bhagya Shri Borse: అలాంటి పాత్రలలో చేయటమే నా కల.. భాగ్య శ్రీ కోరికలు మామూలుగా లేవే!

Bhagya Shri Borse: అలాంటి పాత్రలలో చేయటమే నా కల.. భాగ్య శ్రీ కోరికలు మామూలుగా లేవే!
Advertisement

Bhagya shri Borse: భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె ఈ సినిమా ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న భాగ్యశ్రీ (Bhagya Shri)త్వరలోనే ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ విడుదల కాపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా భాగ్యశ్రీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతుంది.

అరుంధతి లాంటి సినిమాలో..

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సినిమా ఇండస్ట్రీలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలిపారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఇలాంటి పాత్రలలో నటించాలని కోరుకుంటూ ఉంటారు అలాగే భాగ్యశ్రీ కూడా సినిమాల విషయంలో అనుష్క నటించిన అరుంధతి(Arundathi) తరహా ప్రాజెక్టులలో నటించడమే తన కోరిక అంటూ మనసులో మాటను బయటపెట్టారు. మరి సినిమాలలో ఈమె కోరిక నెరవేరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక తెలుగు అభిమానుల గురించి కూడా మాట్లాడుతూ..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నన్ను తెలుగు అమ్మాయిగా భావించి ఎంతగానో ప్రేమించడం చాలా సంతోషంగా ఉందని ఈ గౌరవం ప్రేమ మరింత పెరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పల్లెటూరి అమ్మాయిగా భాగ్యశ్రీ..

Advertisement

ఇక ఆంధ్ర కింగ్ సినిమా నవంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటివరకు మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ మహాలక్ష్మి అనే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒక అభిమాని నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని(Ram Pothineni) సాగర్ అనే పాత్రలో నటించగా కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra) కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

ఆంధ్ర కింగ్ గా మరో స్టార్..

Advertisement

ఈ సినిమాలో ఉపేంద్ర ఆంధ్ర కింగ్ పాత్రలో కనిపించబోతున్నారని ఇదివరకు అందరూ భావించారు కానీ ఇటీవల ప్రమోషన్లలో భాగంగా ఉపేంద్ర ఆంధ్ర కింగ్ పాత్ర గురించి షాకింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో తాను రామ్ పోతినేని ఇద్దరం ఆంధ్ర కింగ్ గా కనిపించమని ఆంధ్ర కింగ్ గా మరో స్టార్ కనిపించబోతున్నారు అంటూ ఈయన అసలు విషయం బయటపెట్టారు. మరి ఆంధ్ర కింగ్ పాత్రలో కనిపించబోతున్న ఆ స్టార్ హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పాటలు సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. కచ్చితంగా ఈ సినిమా రామ్ కు కం బ్యాక్ ఇవ్వబోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

Also Read: BaahubaLi Movie: బాహుబలి లోగోలో క్యాపిటిల్ ‘L’పై స్పందించిన నిర్మాత… అంతా జక్కన్న లీలలు అంటూ క్లారిటీ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×