E-Paper
Advertisement

ఉదయనిధి వ్యాఖ్యలపై యాక్షన్ కింగ్ ‘బ్లాస్ట్’.. సనాతన ధర్మంపై అర్జున్ సర్జా సంచలన కామెంట్స్!

ఉదయనిధి వ్యాఖ్యలపై యాక్షన్ కింగ్ ‘బ్లాస్ట్’.. సనాతన ధర్మంపై అర్జున్ సర్జా సంచలన కామెంట్స్!
Advertisement

Sanatana Dharma:సనాతన ధర్మం అనే పదం ఇపుడు నేషనల్ వైడ్ గా ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు.ఒకరకంగా చెపాలంటే గత కొన్ని రోజులుగా దేశంలోని రాజకీయాలన్ని దీని చుట్టే తిరుగుతున్నాయ్.ఇక తమిళ నాట డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్  ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చడం, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లు కోల్పోవడం తెల్సిందే.

ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఆయన మాత్రం తన పంథా మార్చుకోకుండా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సెన్సేషన్ కామెంట్స్ చేసిన అర్జున్ 

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ వివాదంపై స్పందిస్తూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ పేరు నేరుగా ఎత్తకపోయినా, ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చేలా అర్జున్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ కామెంట్లే ఇపుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.

Advertisement

అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బ్లాస్ట్’ ఇటీవల మే 28న తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదలైంది. వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది కూడా . ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శుక్రవారం చెన్నైలో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో సినిమా విశేషాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  కొన్ని ప్రశ్నలు అడిగింది మీడియా.అందులో భాగంగానే సనాతన ధర్మం నిర్మూలనపై జరుగుతున్న డిబేట్ గురించి ప్రస్తావించగా అర్జున్ చాలా హుందాగా, అంతే స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చారు.

Also read :గేమ్ ఛేంజర్ దెబ్బకు మారిన శంకర్.. 500 కోట్ల ‘వేల్పరి’ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే!

సనాతన ధర్మం అనేది ఒక మతం కాదని, అది ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి జీవన విధానమని అర్జున్ స్పష్టం చేశారు. సమాజంలో ఎలా బతకాలి, తోటి వారితో ఎలా నడుచుకోవాలి, కన్న తల్లిదండ్రులను మరియు దేవుళ్లను ఎలా గౌరవించాలో నేర్పేదే సనాతన ధర్మమని ఆయన వివరించారు. ఎవరైనా తమ సొంత తల్లిదండ్రులను తిరస్కరించగలరా లేదా వారిని వదిలేసి బతకగలరా అని ప్రశ్నించారు. అది ఎలాగైతే సాధ్యం కాదో, సనాతన ధర్మాన్ని కూడా ఈ భూమ్మీద నుంచి ఎవరూ తుడిచివేయలేరని, దాన్ని తిరస్కరించడం ఎవరి తరం కాదని గట్టిగా చెప్పారు. ఒక సంస్కృతిని, జీవన విధానాన్ని రోగాలతో పోల్చడం సరికాదనే అర్థం వచ్చేలా అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.చూడాలి మరి వీటికి స్టాలిన్ నుండి ఎలాంటి కౌంటర్ వస్తుందో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×