// // Anupama Parameswaran: అనుపమ అరుదైన రికార్డు... హ్యాట్రిక్ కొట్టిన నటి! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Anupama Parameswaran: అనుపమ అరుదైన రికార్డు… హ్యాట్రిక్ కొట్టిన నటి!

Anupama Parameswaran: అనుపమ అరుదైన రికార్డు… హ్యాట్రిక్ కొట్టిన నటి!
Advertisement

Anupama Parameswaran: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగడం అంటే ఎంతో కష్టమైన విషయం అని చెప్పాలి. ఒక సినిమాలో అవకాశం వచ్చి ఆ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకుంటేనే వారికి తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి లేదంటే పెద్దగా ఇండస్ట్రీలో లైఫ్ ఉండదని చెప్పాలి. ఓకే ఏడాదిలో ఒక హీరోయిన్ ఒకటి లేదా రెండు సినిమాలలో నటించడం గగనం అలాంటిది అనుపమ మాత్రం ఏకంగా ఒకే ఏడాదిలో ఏడు సినిమాలను విడుదల చేస్తూ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మలయాళీ ముద్దుగుమ్మగా ప్రేమమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఒకే ఏడాదిలోనే ఏడు సినిమాలు..

ఇక 2025వ సంవత్సరంలో ఈమె వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిట్టు ఫ్లాప్ సినిమాలను పక్కన పెడితే ఈమె ఈ ఏడాదిలోనే ఏకంగా ఏడు సినిమాలను విడుదల చేస్తూ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మరి అనుపమ నటించిన ఆ సినిమాలు ఏవి? వీటిలో ఎన్ని సక్సెస్ అందుకున్నాయి అనే విషయానికి వస్తే.. ఈ ఏడాదిలో అనుపమ పరమేశ్వరన్ డ్రాగన్, పరదా, కిష్కిందపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ ది కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

లాక్ డౌన్ రిలీజ్ డేట్ ఫిక్స్ ..

Advertisement

ఇలా ఈ ఆరు సినిమాలలో డ్రాగన్, కిష్కిందపురి, బైసన్ సినిమాలు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి. ఇకపోతే తాజాగా అనుపమ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. లేడీ ఓరియంటెడ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాగా తెరుకెక్కిన “లాక్ డౌన్” (Lock Down)అనే సినిమా ద్వారా అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 5వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో ఏకంగా ఏడు సినిమాలను విడుదల చేశారని చెప్పాలి.

బాలయ్యకు పోటీగా అనుపమ..

Advertisement

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒకే ఏడాదిలో 7 సినిమాలను విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అరుదైన రికార్డును అనుపమ సొంతం చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ సినిమా విషయానికి వస్తే ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కిన ఈ సినిమా ఓ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా కారణంగా మన దేశంలో విధించిన లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు చార్లీ, నిరోషా, రాజ్ కుమార్ ప్రియా వెంకట్ వంటి తదితరులు నటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ సినిమా విడుదలవుతున్న రోజే బాలకృష్ణ నటించిన అఖండ 2 కూడా విడుదల కానుంది . బాలయ్యకు పోటీగా అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Raju Weds Rambai: ఆల్ టైం లోయెస్ట్ ప్రైజ్ తో మూవీ టికెట్స్… రాజు వెడ్స్ రాంబాయ్ కి కలిసొస్తుందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×