E-Paper
Advertisement

Raw Papaya: పచ్చి బొప్పాయి వారానికి 3 సార్లు తింటే.. ఈ రోగాలు రమ్మన్నా రావు

Raw Papaya: పచ్చి బొప్పాయి వారానికి 3 సార్లు తింటే.. ఈ రోగాలు రమ్మన్నా రావు
Advertisement

Raw Papaya: బొప్పాయి పండు మాత్రమే కాకుండా.. పచ్చి బొప్పాయి కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న శక్తివంతమైన ఆహారం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలోని ప్రత్యేక ఎంజైమ్‌లు (పాపైన్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారానికి మూడు సార్లు మీ ఆహారంలో పచ్చి బొప్పాయిని చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. మెరుగైన జీర్ణక్రియ :

పచ్చి బొప్పాయిలో పాపైన్ అనే శక్తివంతమైన ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయ పడుతుంది. తద్వారా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వారానికి మూడు సార్లు దీనిని తీసుకోవడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

Advertisement

2. పేగు ఆరోగ్యం, మలబద్ధకం నివారణ:

దీనిలో ఉండే అధిక ఫైబర్ (పీచు పదార్థం) పేగు కదలికలను మెరుగు పరుస్తుంది. ఇది సహజమైన విరేచనకారిగా పనిచేసి.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా జీవక్రియను ప్రోత్సహిస్తుంది.

3. రోగనిరోధక శక్తి బలోపేతం:

పచ్చి బొప్పాయి విటమిన్ A, C, ఇంకా ఇతర యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి రోగ నిరోధక కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా శరీరం అంటువ్యాధులు, జలుబు వంటి వాటితో పోరాడే శక్తి పెరుగుతుంది.

4.  వాపు నిరోధం:

పాపైన్ , చిమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు శరీరంలో ఏర్పడే వాపును తగ్గించడంలో సహాయ పడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.

5. బరువు తగ్గడం:

పచ్చి బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచి.. అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది.

6. డయాబెటిస్ నియంత్రణ:

పచ్చి బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంది. వారానికి మూడు సార్లు పచ్చి బొప్పాయి తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగు పరచడానికి సహాయ పడుతుంది.

7. చర్మ ఆరోగ్యం:

దీనిలోని ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు చర్మం పునరుజ్జీవానికి తోడ్పడతాయి. ఇది చర్మ కణాల పునరుద్ధరణను వేగవంతం చేసి.. మొటిమలు, మచ్చలు , వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

Also Read: కొంత మందికి.. చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది ?

8. పీరియడ్స్ నొప్పి తగ్గుదల:

పచ్చి బొప్పాయి గర్భాశయ గోడలలోని కండరాల సంకోచాన్ని నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి , అసౌకర్యాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.

9. గుండె ఆరోగ్యం:

దీనిలో పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో అంతే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయ పడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

10. గాయాలు త్వరగా మానడం:

పచ్చి బొప్పాయిలోని ఎంజైమ్‌ల వల్ల గాయాలు, కాలిన గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయ పడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

Also Read: వామ్మో, చలికాలంలో ఇది తింటే ప్రాబ్లమ్స్ పక్కా.. ఎందుకో తెలుసా ?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×