E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu : ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చిరంజీవి నుంచి తప్పించుకున్నాను

Mana Shankara Vara Prasad Garu : ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చిరంజీవి నుంచి తప్పించుకున్నాను
Advertisement

Mana Shankara Vara Prasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల అనే పాట దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించుకుంది. అయితే ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ కూడా నేడు విడుదల చేశారు. శశిరేఖ అనే పాట ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలలో అంతమందికి నిజం కావు. పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయాలి అని ప్రయత్నాలు చేశారు. అవి జరిగినట్లే జరిగి మధ్యలోనే ఆగిపోయాయి. పూరి జగన్నాథ్ విషయానికొస్తే రెండు మూడు సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మొదలుపెట్టలేదు.

అనిల్ రావిపూడి తప్పించుకున్నాడు 

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకత్వం వహించే అవకాశం వస్తుంది అంటే చాలామంది ముందుకు వస్తారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కంటే ముందు ఒక కథను మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారట. అయితే అప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్లాట్ ఖాళీగా లేకపోవడం వలన చెప్పా పెట్టకుండా తప్పుకున్నాడు అనిల్ రావిపూడి.

అయితే కొన్ని రోజులు తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేద్దాం అని అనిల్ రావిపూడి అడిగారట. వెంటనే మనసులో ఏది పెట్టుకోకుండా చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మొదలుపెట్టాడు అనిల్ రావిపూడి.

మెగాస్టార్ కు ఓపిక ఎక్కువ 

Advertisement

నేను సాధారణంగా నాకు మాత్రమే ఓపిక ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాను. కానీ నాకంటే కూడా విపరీతమైన ఓపిక మెగాస్టార్ చిరంజీవికి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కేవలం మన అనుకున్న వాళ్ళతో మాత్రమే కాకుండా అందరితో కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతారు.

ఆయనకు ఉన్న ఓపిక చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది అంటూ అనిల్ రావిపూడి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మెగాస్టార్ అభిమానులతో పాటు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా విపరీతంగా నచ్చుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సినిమా వర్కౌట్ అయితే మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుస్తుంది. గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా పండుగ సీజన్ లోనే మంచి సక్సెస్ సాధించింది.

Also Read : Nivetha Thomas: క్రేజీ కాన్సెప్ట్ తో నివేద థామస్ తమ్ముడు ఇండస్ట్రీ ఎంట్రీ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×