// // Anil Ravipudi : నయనతారను ఎలా ఒప్పించావు అని షాక్ అయిపోయారు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Anil Ravipudi : నయనతారను ఎలా ఒప్పించావు అని షాక్ అయిపోయారు

Anil Ravipudi : నయనతారను ఎలా ఒప్పించావు అని షాక్ అయిపోయారు
Advertisement

Anil Ravipudi : తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన నయనతార తర్వాత కాలంలో హీరోయిన్ గా మారిపోయారు. తమిళ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోస్ తో సినిమా చేయడంతో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలామంది స్టార్ హీరోలతో సినిమా చేశారు నయనతార.

వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోలతో పనిచేశారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు నయనతార. ఈ సినిమాలో శశిరేఖ అనే పాత్రలో కనిపిస్తున్నారు. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటించారు నయనతార.

నయనతారను ఎలా ఒప్పించావు?

Advertisement

ఇకపోతే అనిల్ రావిపూడి సినిమా ఎంత అద్భుతంగా తీస్తాడో అలానే జనాల్లోకి తీసుకెళ్లడంలో కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా తన సినిమా దగ్గర అయ్యేటట్లు ప్లాన్ చేస్తుంటాడు. ప్రమోషన్స్ లో తనదొక ప్రత్యేకమైన శైలి.

మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా అనౌన్స్మెంట్ వీడియో కూడా చాలా క్రేజీగా చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలు అన్నిటినీ కూడా గుర్తు చేశాడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమాలో నయనతార అనౌన్స్మెంట్ వీడియో కూడా క్రేజీగా ఉంటుంది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి స్టైల్ లో నయనతార అనిల్ రావిపూడి కలిసి నమస్కారం పెడతారు. ఈ వీడియో అప్పట్లో బాగా పాపులర్ అయింది. అయితే కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత నయనతార అసలు ప్రమోషన్స్ కి రారు ఎలా ఒప్పించావు అంటూ అనిల్ ను అడిగారట. కేవలం అడగడం మాత్రమే కాకుండా చాలామంది షాక్ అయ్యారు అని అనిల్ రావిపూడి చెప్పాడు.

పెద్దగా ఏమి చెప్పలేదు 

ఇకపోతే నయనతార అలా ప్రమోషన్ కి ఒప్పుకోవడానికి కారణం పెద్దగా ఏదీ లేదు అని రివిల్ చేశాడు. మామూలుగా మీతో మాట్లాడినట్టే సినిమా కాన్సెప్ట్ చెప్పాను మాట్లాడాను ఆవిడ ఇలా చేద్దాం అంటే ఒప్పుకున్నారు అని అనిల్ రావిపూడి అన్నాడు. కొంతమంది చెబుతారు కదా దైవ నిర్ణయం అన్నట్లు ఈ సినిమా విషయంలో కూడా అలానే జరిగిపోయింది అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Also Read: GV Prakash : హీరోగా జీవి ప్రకాష్ కొత్త సినిమా, ఆకట్టుకుంటున్న పోస్టర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×