E-Paper
Advertisement

విక్రమ్ సాహిదేవ్ ‘అనకాపల్లి’ మాస్ ట్రీట్.. మంగ్లీ వాయిస్‌తో మారుమోగుతున్న అమ్మోరు పాట!

విక్రమ్ సాహిదేవ్ ‘అనకాపల్లి’ మాస్ ట్రీట్.. మంగ్లీ వాయిస్‌తో మారుమోగుతున్న అమ్మోరు పాట!
Advertisement

Anakapalli Movie : విక్రమ్ సాహిదేవ్..నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’,ఎవడు తక్కువ కాదు,వర్జిన్ స్టోరీ సినిమాలతో మంచి మార్కులు కొట్టేసిన ఈ కుర్ర హీరో తాజాగా నటిస్తున్న సినిమా ‘అనకాపల్లి’ (Anakapalli).నక్కిన నరేటివ్స్ బ్యానర్‌,భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో సంద్యా వశిష్ట హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాలో తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనుండగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా నాయుడు కాండ్రేగులతో సినిమాని నిర్మించడం విశేషం.

మంగ్లీ పాడిన ‘అమ్మోరు దిగినాది’

Advertisement

తాజాగా డావ్‌జాండ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా నుండి వదిలిన ‘అమ్మోరు దిగినాది’ అనే సాంగ్ ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.తన గాత్రంతో పాటలని మరో మెట్టు ఎక్కించే మంగ్లీ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో ఈ పాటను నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోగా సీనియర్ నటి సంగీత ప్రదర్శించిన ఉగ్రరూపం పాటకే హైలెట్‌గా నిలిచిందని చెప్పాలి.ఇక ఒక ఊరి జాతరను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ విజువల్ ట్రీట్‌కు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయడం మరో హైలెట్. మంగ్లీ పాటకి, శేఖర్ మాస్టర్ స్టెప్పులు కలిస్తే థియేటర్లలో ఆడియన్స్ కి పూనకాలు పక్కా అంటూ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు మేకర్స్ .

ALSO READ: ఛోళీ కే పీచే.. మళ్ళీ అదే డర్టీ పిక్చర్! తమన్నాకు ఇది అవసరమా?

Advertisement

ఒక పవర్‌ఫుల్ రూటెడ్ యాక్షన్ డ్రామా

ఇక ఇదివరకే వదిలిన టీజర్ చూస్తె విక్రమ్ సాహిదేవ్ ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని రఫ్ అండ్ టఫ్ లుక్‌,ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీలతో మెప్పించాడనే చెప్పాలి.”’అనకాపల్లిలో నీకు ఏదైనా కావాలంటే ముందున్నవాడికి నీవంటే భయం ఉండాలి” అంటూ టీజర్‌లో విక్రమ్ న చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ సినిమా ఇంటెన్సిటీని చాటి చెబుతోంది.ఓవరాల్ గా సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో   అక్కడి మట్టి మనుషుల భావోద్వేగాలు, మరియు ఒక ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ కలగలిపిన  ఒక పవర్‌ఫుల్ రూటెడ్ యాక్షన్ డ్రామాను చూడబోతున్నామన్న క్లారిటీ వచ్చేసింది.ఇకపోతే ఈ సినిమాలో ఇంద్రజ అబ్బర్‌, మహబూబ్‌నగర్‌ భాషా, శ్రీనివాస్‌ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్‌ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మే 8న వరల్డ్ వైడ్ గా  థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

యాక్షన్ అండ్ సెంటిమెంట్ సీన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటామంటున్న మేకర్స్ ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు పెంచిన‘అనకాపల్లి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో !

ALSO READ: సౌండ్‌ప్రూఫ్ రూమ్‌లో లాక్ చేసి.. సింగర్ పై ప్రముఖ సంగీత దర్శకుడి అఘాయిత్యం!

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×