E-Paper
Advertisement

యెజ్డీ స్క్రాంబ్లర్ vs స్క్రామ్ 440.. ఏది బైక్ కొంటే బెస్ట్?

యెజ్డీ స్క్రాంబ్లర్ vs స్క్రామ్ 440.. ఏది బైక్ కొంటే బెస్ట్?
Advertisement

2026 Yezdi Scrambler vs Scram 440 Comparison: సరికొత్తగా అప్ డేట్ అయిన యెజ్డీ స్క్రాంబ్లర్ భారత మార్కెట్‌ లోకి వచ్చేసింది. ఈ బైక్ డిజైన్, ఇంజన్‌ లో కొన్ని మార్పులతో మరింత క్రేజీగా రెడీ అయ్యింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440తో నేరుగా పోటీ పడుతోంది. ఈ రెండు బైక్‌ల మధ్య తేడాలను ఇప్పుడు చూసేద్దాం.

డిజైన్ గురించి..

ఈ రెండూ రెట్రో స్టైల్‌ తో కనిపించే స్క్రాంబ్లర్ బైక్‌ లే. యెజ్డీ స్క్రాంబ్లర్‌ లో రౌండ్ LED హెడ్‌ లైట్, సింపుల్ బాడీ, పైకి వంగి ఉండే ఎగ్జాస్ట్ ఉంటుంది. ఇది కొంచెం మోడర్న్ టచ్‌ తో స్టైలిష్‌ గా కనిపిస్తుంది. మరోవైపు, స్క్రామ్ 440 మాత్రం క్లాసిక్ లుక్‌ ను కొనసాగిస్తుంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా,  బలంగా ఉంటుంది. ట్యాంక్ ఆకారం, బాడీ స్టైల్ చాలా క్లీన్‌ గా కనిపిస్తాయి.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజన్ విషయానికి వస్తే, యెజ్డీ స్క్రాంబ్లర్‌ లో 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారు 29.4 bhp పవర్, 30 Nm టార్క్ ఇస్తుంది. ఎక్కువగా హై RPMలో పనితీరు చూపిస్తుంది. స్క్రామ్ 440లో మాత్రం 443cc ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 25.4 bhp పవర్, 34 Nm టార్క్ ఇస్తుంది. ఇది తక్కువ RPM లోనే మంచి టార్క్ ఇస్తుంది.  రిలాక్స్‌ గా రైడ్ చేయడానికి బాగా సరిపోతుంది.

ఇక సస్పెన్షన్, రైడింగ్ విషయానికి వస్తే, యెజ్డీ స్క్రాంబ్లర్‌ లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. స్క్రామ్ 440లో ముందు ఫోర్క్‌ తో పాటు వెనుక మోనోషాక్ ఉంటుంది. స్క్రామ్‌ లో సస్పెన్షన్ ట్రావెల్ ఎక్కువగా ఉండటం వల్ల గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై చక్కగా వెళ్తుంది. రెండు బైక్‌ లలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సమానంగా ఉంటుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Advertisement

ఫీచర్ల పరంగా యెజ్డీ స్క్రాంబ్లర్ కొంచెం ముందుంది. ఇందులో LCD డిస్‌ ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్చబుల్ ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఆఫ్ రోడింగ్‌ కు ఉపయోగపడతాయి. స్క్రామ్ 440లో మాత్రం సెమీ డిజిటల్ మీటర్ ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్ అనలాగ్‌ గా ఉండగా, మిగతా సమాచారం డిజిటల్‌ గా చూపిస్తుంది. అలాగే, ట్రిప్పర్ నావిగేషన్ ఆప్షన్‌ గా అందుబాటులో ఉంటుంది.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ధరల విషయానికి వస్తే, యెజ్డీ స్క్రాంబ్లర్ ధర సుమారు రూ. 1.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్క్రామ్ 440 ధర మాత్రం రూ. 2.23 లక్షల వరకు ఉంటుంది. అంటే యెజ్డీ బైక్ కొంచెం చవకగా ఉంటుంది. స్టైలిష్ లుక్, కొత్త ఫీచర్లు కావాలంటే యెజ్డీ స్క్రాంబ్లర్ మంచి ఆప్షన్.  రిలాక్స్‌ గా రైడ్, ఎక్కువ టార్క్ కావాలనుకుంటే స్క్రామ్ 440 బెటర్.

Read Also: మండుటెండలో చల్లని ప్రయాణం.. క్రేజీ KYT R1R హెల్మెట్ లాంచ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×