E-Paper
Advertisement

Bunny Basil: అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబో ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే?

Bunny Basil: అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబో ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే?
Advertisement

Bunny Basil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళంలో ‘మిన్నల్ మురళి’ వంటి వినూత్నమైన సూపర్ హీరో చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో బన్నీ ఒక భారీ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారు. ఇటీవల అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో బాసిల్ జోసెఫ్ మెరవడంతో ఈ వార్త మరింత వైరల్ అయ్యింది. అందులోనూ అల్లు అర్జున్ కు మళయాళంలో మంచి క్రేజ్ ఉండటంతో బాసిల్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Read also-ఓటీటీలోకి శివాజీ – లయ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని!

Advertisement

అల్లు అర్జున్‌కు కేరళలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అక్కడ ఆయనను అభిమానులు ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. ఇప్పుడు నేరుగా ఒక మలయాళ స్టార్ డైరెక్టర్‌తో బన్నీ సినిమా చేస్తుండటం విశేషం. బాసిల్ జోసెఫ్ తన కథల్లో హ్యూమర్, ఎమోషన్ గ్రాండియర్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాసిల్ ఒక యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లేదా సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

షూటింగ్ వివరాలు

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. అట్లీ (Atlee), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు లైన్ లో ఉన్నాయి. బన్నీ ప్రస్తుత కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత, బాసిల్ జోసెఫ్ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో బాసిల్ జోసెఫ్ స్క్రిప్ట్‌ను పూర్తిస్థాయిలో మెరుగుపరిచి, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నారు.

Advertisement

Read also-రంగస్థలం @8ఏళ్లు.. ఎవరికి తెలియని తెరవెనుక విషయాలు?

నిర్మాతలు ఎవరంటే?

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లు టాక్. బాసిల్ జోసెఫ్ గతంలో హిందీలో ‘శక్తిమాన్’ ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు అదే తరహా భారీ కాన్సెప్ట్‌ను అల్లు అర్జున్ కోసం బాసిల్ రీ-వర్క్ చేస్తున్నారా? అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. మార్చి 2026లో జరిగిన అల్లు శిరీష్ వేడుకల్లో అల్లు అర్జున్ తన భవిష్యత్ చిత్రాల దర్శకులైన అట్లీ, సుకుమార్ బాసిల్ జోసెఫ్లను ఒకే వేదికపై పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×