E-Paper
Advertisement

మీటర్ లో నెంబర్ జంప్ అవుతుందా? బంక్ లో ఫ్రాడ్ జరుగుతున్నట్టే!

మీటర్ లో నెంబర్ జంప్ అవుతుందా? బంక్ లో ఫ్రాడ్ జరుగుతున్నట్టే!
Advertisement

Fuel Fraud Awareness: పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి తరచుగా వింటూనే ఉంటాం. పెట్రోల్ పోసే సమయంలో ఆపరేటర్లు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్న బోలెడు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ ఇంధనం నింపి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, కల్తీ పెట్రోల్ అమ్మడం లాంటివి కూడా చూశాం. అయితే, పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ మోసాల నుంచి సులభంగా గుర్తించి తప్పించుకోవచ్చు.

పెట్రోల్ బంక్ లో మోసాలు ఎలా జరుగుతాయంటే?

బైక్ లో లేదంటే కారులో  పెట్రోల్ నింపే ముందు మీటర్  ‘జీరో’లో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. బంక్ లో చెక్ చేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో బంక్ సిబ్బంది ముందుగా మీటర్‌ ను రీసెట్ చేయకుండా ఫ్యూయెల్ పోయడం మొదలుపెడతారు. ఇలా చేయడం వల్ల మీరు ఇచ్చే డబ్బులకు తగినంత ఇంధనం రాకపోవచ్చు. సో, ఎప్పుడూ జీరో చూసిన తర్వాతే ఫ్యూయల్ నింపించాలి. అవసరమైతే సిబ్బందిని రీసెట్ చేయమని అడగాలి.

డెన్సిటీని కచ్చితంగా గమనించాలి!

Advertisement

ఇంకో ముఖ్యమైన విషయం ఇంధన సాంద్రత. ప్రతి పెట్రోల్ బంక్‌ లో డెన్సిటీ వ్యాల్యూ డిస్ ప్లేలో కనిపిస్తాయి. ఇవి నిర్ణీత రేంజ్ లోనే ఉండాలి. పెట్రోల్ డెన్సిటీ 720 నుంచి 775 వరకు ఉంటుంది. డెన్సిటీ తక్కువగా ఉంటే, పెట్రోల్ నాణ్యతలో లోపం ఉన్నట్లు గుర్తించాలి. అలాగే, ఫ్యూయల్ ఫ్లో చాలా వేగంగా ఉన్నట్లు అనిపిస్తే కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీటర్‌ ను మానిప్యులేట్ చేసి వేగంగా చూపిస్తూ తక్కువ ఇంధనం ఇస్తారు. అందుకే, పెట్రోల్ మీటర్ రిడింగ్ లో నెంబర్స్ వరుసగా వెళ్లాలి. జంప్ అవుతూ వెళ్తే, ట్యాంపర్ చేస్తున్నట్లు గుర్తించాలి.

చివరగా పెట్రోల్ నింపిన తర్వాత కూడా ఓసారి మీ వెహికల్ ట్యాంక్ ను గమనించాలి. సాధారణంగా మీరు ఎంత ఫ్యూయెల్ నింపుచుకున్నారు? ఇంచుమించు అంత ఉందా? లేదా? అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం కలిగితే, వెంటనే బంక్ సిబ్బందిని ప్రశ్నంచాలి.

బంకులో మోసాలతో జాగ్రత్త

Advertisement

పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి ముందుగానే ఓ అవగాహన కలిగి ఉండటం మంచిది. పెట్రోల్ బంకుల్లో సిబ్బంది చేసే జిమ్మిక్కులను తెలుసుకుంటే, వాటిని గుర్తించడం సులభమవుతుంది. సోషల్ మీడియా, వార్తల ద్వారా వచ్చిన సమాచారాన్ని గమనిస్తూ ఉండటం మంచిది. ఒకవేళ మీరు మోసాన్ని గుర్తిస్తే వెంటనే చర్యల కోసం పట్టుబట్టాలి. ప్రతి పెట్రోల్ బంక్‌లో కంప్లైంట్ బుక్ తప్పనిసరిగా ఉంటుంది. దానిని అడిగి మీ ఫిర్యాదును ఎంట్ చేయాలి. అవసరమైతే ఫోటోలు, వీడియోలు తీసి సాక్ష్యంగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఆయిల్ కంపెనీల అధికారిక వెబ్‌ సైట్లలో కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ ఒకే బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది.

Read Also: E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×