E-Paper
Advertisement

Akhanda 2 : బాలయ్యకు ఘోర అవమానం.. ఆ ఏరియాలో పట్టుమని పది షోలు కూడా పడలే..

Akhanda 2 : బాలయ్యకు ఘోర అవమానం.. ఆ ఏరియాలో పట్టుమని పది షోలు కూడా పడలే..
Advertisement

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ 2(Akhanda 2) సినిమా డిసెంబర్ ఐదవ తేదీ 12వ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలకృష్ణ సినీ కెరియర్ లోనే మొదటిసారి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక బాలకృష్ణ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒకచోట ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల ముంబైలో ఒక సాంగ్ లంచ్ కార్యక్రమంతో పాటు ఒక ఇంటర్వ్యూ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రమోషన్లకే రూ. 2 కోట్లు…

మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హిందీలో కూడా భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ మాత్రం అనుకున్న స్థాయిలో బాలకృష్ణ సినిమాకు ఆదరణ రాలేదని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం… ముంబై ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో పట్టుమని 10 షోలు కూడా ఈ సినిమా కోసం షెడ్యూల్ చేయలేదని తెలుస్తుంది. ముంబైలో హిందీ వర్షన్ కోసం పది షోలు కూడా లేవు అలాగే ఢిల్లీలో సున్నా షోలు ఉన్న నేపథ్యంలో అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కేవలం నార్త్ ప్రమోషన్స్ కోసమే ఏకంగా రెండు కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.

కేవలం 40 షోలు మాత్రమే…

Advertisement

ముంబైలోని పలు ప్రధాన నగరాలలో పెద్ద ఎత్తున బిల్ బోర్డులను ఏర్పాటు చేయటం, అలాగే హిందీ వార్త పత్రికలలో ప్రకటనల ద్వారా అఖండ2 సినిమాకు కావలసినంత ప్రమోషన్లను నిర్వహిస్తూ వచ్చారు. ఇలా హిందీ ప్రమోషన్ల కోసమే ఏకంగా రెండు కోట్ల వరకు ఖర్చు చేశారు అలాగే అఖండ చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కలిసిన సంగతి తెలిసిందే. ఇలా సినిమా ఈవెంట్లు ప్రెస్ మీట్ కార్యక్రమాలు ఇంటర్వ్యూలు అంటూ నార్త్ ఇండియాలో కూడా భారీగానే సినిమా కోసం ఖర్చు చేస్తూ ప్రమోషన్లను నిర్వహించారు. ఈ స్థాయిలో ప్రమోషన్లను నిర్వహించిన భారతదేశం మొత్తం కలిపి హిందీ వర్షన్ కోసం కేవలం 40 షోలు మాత్రమే ఉన్న నేపథ్యంలో అభిమానులు షాక్ అవుతున్నారు.

రణవీర్ సింగ్ ధురందర్..

Advertisement

సినిమా విడుదలకు మరొక రోజు సమయం ఉన్న నేపథ్యంలో చివరి క్షణంలో షోలు పెరుగుతాయా లేకపోతే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ ఆధారంగా అయిన అఖండ సినిమా షోలను పెంచుతారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ధురందర్ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో అక్కడ ఆఖండ2 సినిమాకు అనుకున్న విధంగా ఆదరణ రాలేదని అభిమానులు భావిస్తున్నారు. మరి అఖండ 2 సినిమా ద్వారా బాలయ్య నార్త్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Mythri Movie Makers: సర్దుమనిగిన వివాదం.. ఇళయరాజకు ఫైన్ కట్టిన మైత్రి మేకర్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×