// // Most Wanted Gangster Arrest - పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్...? -->
E-Paper
Advertisement

Most Wanted Gangster Arrest: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్….?

Most Wanted Gangster Arrest: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్….?
Advertisement

Most Wanted Gangster Arrest: చిత్తూరు జిల్లా గుడిపాలలో పోలీసుల తనిఖీలు, గాలింపు చర్యలు ఫలితాన్నిచ్చాయి. హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, గ్యాంగ్ రేప్‌లు వంటి అనేక ఘోర నేరాలకు పాల్పడిన ఓ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్‌ను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు అలెక్స్‌గా గుర్తించగా, అతడు తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలైకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం వెల్లూరు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో అలెక్స్ అత్యంత క్రూరమైన నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా తేలింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకుని గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడేలా చేసి వారిని తనకు అనుకూలంగా మార్చుకోవడం అతడి ప్రధాన వ్యూహంగా పోలీసులు గుర్తించారు. ఒకసారి మత్తుకు బానిసలుగా మార్చిన అనంతరం వారి ద్వారానే అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తూ, యువతులపై నేరాలకు పాల్పడుతున్నాడని సమాచారం.

Advertisement

గిరిజన ప్రాంతాలే అతడి ప్రధాన టార్గెట్‌గా మారాయని పోలీసులు చెబుతున్నారు. ఒంటరిగా ఉన్న యువతులను గుర్తించి, బెదిరింపులతో  దగ్గర చేసుకుని అత్యాచారానికి పాల్పడి.. అక్కడి నుంచి పరారవడం అతడి సాధారణ అలవాటుగా మారినట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన అనేక రేప్ కేసుల వెనుక కూడా అలెక్స్ హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

గత వారం గుడిపాల మండల పరిధిలో ఓ యువతిపై అలెక్స్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదైంది. నేరం చేసిన అనంతరం అతడు పారిపోతుండగా, స్థానిక గ్రామస్తులు అనుమానాస్పదంగా కదులుతున్న వ్యక్తిని అడ్డుకున్నారు. ఆ సమయంలో గ్రామస్తులను కత్తులతో బెదిరించడంతో పాటు, ఓ యువకుడు అడ్డుపడగా అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది.

Advertisement

బాధిత యువతి ధైర్యంగా ముందుకు వచ్చి గుడిపాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతడు తరచూ తన ప్రాంతాలను మార్చుకుంటూ, నకిలీ పేర్లతో సంచరిస్తూ తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో చిత్తపార గ్రామానికి చెందిన మల్లేష్ సహకారంతో గుడిపాల పోలీసులు ప్రత్యేక వలపన్ని, గోప్యమైన సమాచారంతో అలెక్స్‌ను పట్టుకున్నట్లు తెలిసింది.

పోలీసుల విచారణలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అలెక్స్‌పై ఇప్పటికే 50కి పైగా కేసులు నమోదయ్యాయని తేలింది. హత్యాయత్నాలు, మహిళలపై లైంగిక దాడులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు వంటి తీవ్రమైన నేరాలు ఈ కేసుల్లో ఉన్నాయి. అంతేకాకుండా నెలవారీ వసూళ్లు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయని కూడా పోలీసుల ప్రాథమిక అంచనా. ఈ అక్రమ సంపాదన ద్వారా అతడు పలువురు నేరస్తులను పోషిస్తూ, తనకు అనుకూలంగా ఒక పెద్ద నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది.

Also Read:  రైలులో ఎనిదేళ్ల బాలికపై అత్యాచారం.. కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు

ప్రస్తుతం అలెక్స్‌ను గుడిపాల పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అతడి నెట్‌వర్క్ ఎంత వరకు విస్తరించి ఉందో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనుచరులు ఎవరో, గతంలో జరిగిన పరిష్కారంలేని నేరాల్లో అతడి పాత్ర ఎంత ఉందో అన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసు ద్వారా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×